For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా ఓపెన్‌: ప్రీ క్వార్టర్స్‌కు సింధు, ప్రణయ్.. కష్టపడి నెగ్గారు

By Nageshwara Rao
China Open: PV Sindhu, Saina Nehwal, HS Prannoy in round two

హైదరాబాద్: ఫుజోహు వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, హెచ్ఎస్ ప్రణయ్‌‌లు ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. సైనా అలవోకగా తొలి రౌండ్‌‌లో విజయం సాధించగా... సింధు, ప్రణయ్‌లకు మాత్రం తొలి రౌండ్లో గట్టి పోటీ ఎదురైంది.

ఇటీవలే జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సింధును ఓడించిన సైనా... తొలి రౌండ్లో అమెరికా క్రీడాకారిణి బైవాన్‌ జాంగ్‌ను 21-13, 21-13తో అలవోకగా ఓడించింది. 30 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. రెండో రౌండ్లో సైనా.. జపాన్‌ అగ్ర క్రీడాకారిణి, ఐదో సీడ్‌ యమగూచితో గురువారం తలపడనుంది.

ఇక, బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సింధు 24-22, 23-21తో సాటో సయాకా (జపాన్‌)పై కష్టపడి నెగ్గింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్‌ కూడా 18-21, 21-16, 21-19తో లీ డాంగ్‌ క్యున్‌ (కొరియా) కష్టపడి నెగ్గాడు, మరో ఆటగాడు సౌరభ్‌ వర్మ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

కాగా డబుల్స్‌లో భారత జోడీలు తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటి ముఖం పట్టాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జోడీ 13-21, 13-21తో చెంగ్‌ లి-నాన్‌ హాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. మను అత్రి-సుమీత్‌ రెడ్డి 18-21, 15-21తో ఇండోనేసియా జంట మార్కస్‌ ఫెర్నాండీ-కెవిన్‌ సంజయ చేతిలో పరాజయం పాలైంది.

మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- సిక్కిరెడ్డి జంట 14-21, 15-21తో కొరియా జంట హానబెక్‌-చె యు జంగ్‌ చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప 19-21, 21-17, 13-21తో మథియాస్‌-క్రిస్టినా (డెన్మార్క్‌) జంట చేతిలో ఓడారు.

పురుషుల సింగిల్స్‌లో చైనా దిగ్గజ ఆటగాడు లిన్‌ డాన్‌ తొలి రౌండ్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మూడో సీడ్‌ డాన్‌ 19-21, 16-21తో అన్‌ సీడెడ్‌ జొనాటన్‌ క్రిస్టీ (ఇండొనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, November 16, 2017, 9:43 [IST]
Other articles published on Nov 16, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+