అడుగు దూరం: చైనా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన సింధు
హైదరాబాద్: చైనా సూపర్ సిరీస్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దూసుకుపోతుంది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. చైనా ఓపెన్ సిరిస్‌లో పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకుంది.

సెమీఫైనల్స్‌లో భాగంగా శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆరో సీడ్ సుంగ్ జి హ్యున్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు వెంటనే పుంజుకుని సత్తాచాటింది.
ఆ తర్వాత సాగిన రెండు గేమ్‌ల్లో సింధు సుంగ్ జి హ్యున్‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)తో సింధు తలపడుతుంది.
ముఖాముఖి రికార్డులో సింధు 2-3తో వెనుకబడింది. వీరిద్దరూ చివరిసారి 2014 స్విస్ ఓపెన్‌లో తలపడగా సున్ యు గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications