న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎదురెదురుగా తలపడనున్న సింధు.. సైనా

 China Open: Fatigued Sindhu could meet Saina in quarters, Srikanth again on course to face Momota

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ చైనా ఓపెన్‌పై కన్నేశారు. రెండేళ్ల క్రితం (2016) ఇక్కడ విజేతగా నిలిచిన సింధు ఈసారీ టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో ఉంది. చైనా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ 1000 టోర్నీలో సింధు, సైనా క్వార్టర్‌ఫైనల్లో ఎదురొవ్వచ్చు. మంగళవారం నుంచి జరిగే చైనా ఓపెన్‌లో 23 ఏళ్ల సింధు మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో కువకమి (జపాన్‌)తో సింధు తలపడుతుంది.

క్వార్టర్‌ఫైనల్లో సింధు, సైనా ముఖాముఖి

క్వార్టర్‌ఫైనల్లో సింధు, సైనా ముఖాముఖి

ప్రిక్వార్టర్స్‌లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) లేదా బీట్రిజ్‌ (స్పెయిన్‌)తో సింధు పోటీపడొచ్చు. మరోవైపు తొలి రౌండ్లో సుంగ్‌ హ్యున్‌ (కొరియా)ను సైనా ఢీకొంటుంది. ప్రిక్వార్టర్స్‌లో సయాక సాటో (జపాన్‌) లేదా చెన్‌ యుఫెయ్‌ (చైనా)తో సైనా తలపడొచ్చు. తొలి రెండు రౌండ్లు అధిగమిస్తే.. క్వార్టర్‌ఫైనల్లో సింధు, సైనా ముఖాముఖి ఎదురవుతారు. ఇప్పటి వరకు వీరిద్దరు నాలుగు సార్లు తలపడగా.. మూడింట్లో సైనా, ఒక మ్యాచ్‌లో సింధు పైచేయి సాధించారు.

డెన్మార్క్‌‌తో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌

డెన్మార్క్‌‌తో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో రస్‌ముస్‌ గెమ్కీ (డెన్మార్క్‌)తో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌, లాంగ్‌ ఆగ్నస్‌ (హాంకాంగ్‌)తో ప్రణయ్‌ పోటీపడతారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో షెమ్‌- టాన్‌ కియోంగ్‌ (మలేసియా)తో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌, మిన్‌ చున్‌- చింగ్‌ హెంగ్‌ (చైనీస్‌ తైపీ)తో సుమీత్‌రెడ్డి- మను అత్రి.

సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప

సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో కిమ్‌ యియాంగ్‌- కాంగ్‌ యాంగ్‌ (కొరియా)తో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో మార్కస్‌- లారెన్‌ (ఇంగ్లాండ్‌)తో సాత్విక్‌- అశ్విని, మర్విన్‌- లిండా (జర్మనీ)తో ప్రణవ్‌- సిక్కిరెడ్డి తలపడతారు.

తగినంత విశ్రాంతి లభించక:

తగినంత విశ్రాంతి లభించక:

చైనా ఓపెన్‌లో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందన్నది వేచిచూడాల్సిందే. కామన్వెల్త్‌ గేమ్స్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌, ఆసియాడ్‌.. ఈ సీజన్‌లో జరిగిన ప్రధాన ఈవెంట్లలో సింధు రజత పతకాలతో సత్తా చాటింది. ఇండియన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్లలోనూ ఆమె ఫైనల్స్‌కు చేరింది. అయితే ఊపిరి సలపని షెడ్యూల్‌తో ఆమెకు తగినంత విశ్రాంతి లభించడంలేదు.

Story first published: Tuesday, September 18, 2018, 9:37 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X