For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా ఓపెన్‌లో సింధు ఓటమి: ముగిసిన భారత షట్లర్ల పోరాటం

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. భారత్‌ తరఫున చివరిగా బరిలో ఉన్న పీవీ సింధు కూడా క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది.

By Nageshwara Rao
China Open: Defending champion PV Sindhu loses to teenager in quarter-finals

హైదరాబాద్: చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. భారత్‌ తరఫున చివరిగా బరిలో ఉన్న పీవీ సింధు కూడా క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సింధు 11-21, 10-21తో గావొ ఫాంగ్‌జీ(చైనా) చేతిలో ఓడిపోయింది.

38నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో పీవీ సింధు ప్రత్యర్ధి గావొ ఫాంగ్‌జీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రస్తుత వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సింధు రెండో స్ధానంలో కొనసాగుతుండగా... ఫాంగ్‌జీ 89వ ర్యాంకులో కొనసాగుతోంది. సింధుకి ఈ ఓటమి నిజంగా ఊహించని షాకిచ్చింది.

ఇదిలా ఉంటే గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్‌‌లు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, గాయం కారణంగా కిదాంబి శ్రీకాంత్‌ ఈ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 16:57 [IST]
Other articles published on Nov 17, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+