Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

China Open 2019: సైనా ఇంటికి, రెండో రౌండ్‌లోకి పారుపల్లి కశ్యప్

China Open 2019: Saina Nehwal Poor Form Continues As She Loses in First Round; Parupalli Kashyap into The Second Round

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది అంతగా కలిసొచ్చినట్లు అనిపించడం లేదు. పేలవ ఫామ్‌తో వరుస టోర్నీల్లో ఘోరంగా ఓడిపోతున్నారు. తాజాగా చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సైనా తొలిరౌండ్‌లోనే నిష్క్రమించింది.

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో చైనా క్రీడాకారిణి కై యాన్‌ యాన్‌ చేతిలో వరుస గేముల్లో 9-21 12-21తేడాతో ఓడిపోయింది. 24 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి కై యాన్‌ యాన్‌ చేతిలో సైనా నెహ్వాల్ చిత్తుగా ఓడింది.

ఈ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్‌లోనే 9-21తో ఓడిపోయిన సైనా ఇక, రెండో గేమ్‌లో తేలిపోయింది. ఫలితంగా 12-21 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 29 ఏళ్ల సైనా నెహ్వాల్‌ ఈ ఏడాది కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండోనేషియా మాస్టర్ నుంచి సైనా ఫిట్ నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడానికి ముందు వరుసగా మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

ఇక, పురుషుల సింగిల్స్‌లో సైనా భర్త పారుపల్లి కశ్యప్‌ రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారుడు సిత్తికోమ్‌ థమ్మాసిన్‌పై 21-14, 21-3 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో ఏడో సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌(డెన్మార్క్‌)తో తలపడనున్నాడు.

మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా-సిక్కి రెడ్డిల జోడీ కూడా తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఈ జోడి చైనీస్ తైపీకి చెందిన వాంగ్ చి లిన్-చెంగ్ చి య జోడీ చేతిలో 14-21, 14-21తేడాతో ఓటమి పాలైంది.

Story first published: Wednesday, November 6, 2019, 12:48 [IST]
Other articles published on Nov 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+