Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీబీఎల్‌ సందడి షురూ: మారిన్‌తో సింధు పోరు

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) మూడో సీజన్‌ సందడి మొదలైంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారుల రాకతో హైదరాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా జనవరి 1 నుంచి మొదలవుతున్న ఆరంభ మ్యాచ్‌లో టాప్ షట్లర్లు కరోలినా మారిన్, పీవీ సింధు తలపడనున్నారు.

వీరిద్దరి మధ్య జరగనున్న పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రియో ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో తనను ఓడించిన మారిన్‌పై బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో పీవీ సింధు ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పీబీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ హంటర్స్‌ ప్లేయర్‌ మారిన్‌, చెన్నై స్మాషర్స్‌ స్టార్‌ పీవీ సింధు మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్‌ హంటర్స్‌ తరుపున కరోలినా మారిన్

హైదరాబాద్‌ హంటర్స్‌ తరుపున కరోలినా మారిన్

పీబీఎల్‌లో కరోలినా మారిన్ హైదరాబాద్‌ హంటర్స్‌ తరుపున బరిలోకి దిగుతుంది. ఈ సందర్భంగా కరోలినా మారిన్ మాట్లాడుతూ ‘హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. భారతలో ఉండడం కొత్త అనుభూతినిస్తోంది. లీగ్‌లో నా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. సింధుతో మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మా ఇద్దరి పోరాటం అభిమానులకు వినోదం పంచడం ఖాయం' అని చెప్పింది.

హైదరాబాద్‌ అభిమానుల మద్దతు మాకే

హైదరాబాద్‌ అభిమానుల మద్దతు మాకే

ఇక 'సింధుతో మ్యాచ్‌లో హైదరాబాద్‌ అభిమానుల మద్దతు నాకే ఉంటుందని ఆశిస్తున్నా. 11 పాయింట్ల ఫార్మాట్‌ చాలా కష్టమైనది. ఈ ఫార్మాట్‌ నాకు కొత్త. ఇందులో ప్రతీ పాయింట్‌ చాలా ముఖ్యం. సింధుపై నెగ్గేందుకు శాయశక్తులా కృషి చేస్తానని' మారిన్ చెప్పుకొచ్చింది. కోర్టులో మా ఇద్దరి మధ్య ఉన్న రైవలరీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది.

మంచి మ్యాచ్‌గా నిలుస్తుందని చెప్పిన మారిన్

మంచి మ్యాచ్‌గా నిలుస్తుందని చెప్పిన మారిన్

అయితే ఈ లీగ్‌లో తమ ఇద్దరి మధ్య ఒలింపిక్స్ మ్యాచ్ అంతటి తీవ్రత ఉండకపోయినా, ఈ మ్యాచ్ మాత్రం ఓ మంచి మ్యాచ్‌గా నిలుస్తుందని మారిన్ పేర్కొనడం విశేషం. మరోవైపు సింధు చాలా వేగంగా పరిణతి సాధిస్తోందని, ఆమెతో మ్యాచ్‌ అంటే సవాల్‌తో కూడుకున్న విషయమని ఒక ప్రశ్నకు బదులుగా మారిన్ సామాధానం చెప్పింది.

మారిన్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే: సింధు

మారిన్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే: సింధు

ఇక పీబీఎల్‌లో చెన్నై స్మాషర్స్‌ తరుపున బరిలోకి దిగుతున్న పీవీ సింధు మాట్లాడుతూ మారిన్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే అని చెప్పుకొచ్చింది. ‘‘రియో ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ మారిన్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. సొంతగడ్డ చెన్నైలో అభిమానుల ముందు మ్యాచ్‌లు ఆడకపోవడం సమస్య కాదు. గత సీజన్‌లో కూడా అక్కడ మ్యాచ్‌లు ఆడలేదు. ఐతే హైదరాబాద్‌లో కూడా చెన్నై అభిమానులు మా జట్టుకు మద్దతుగా నిలుస్తారు'' అని సింధు చెప్పింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+