న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారిన్ విజయం: ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలిచిన హంటర్స్‌

By Nageshwara Rao
Carolina Marin inspires Hyderabad Hunters to win over NorthEast Warriors in PBL

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టు శుభారంభం చేసింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఈ సీజన్‌తో అరంగేట్రం చేసిన కొత్త జట్టు నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 5-2తో విజయం సాధించింది.

ప్రపంచ మాజీ నంబర్‌వన్‌, రియో ఒలింపిక్‌ విజేత కరోలినా మారిన్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మహిళల సింగిల్స్‌లో కరోలినా మారిన్ 15-9, 15-11తో మిచెలీ లిపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను హంటర్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకోవడంతో రెండు పాయింట్లు లభించాయి.

తొలి మ్యాచ్‌లో మార్కిస్‌ కిడో-యు యోన్‌ సియోంగ్‌ (హంటర్స్‌) జోడీ 15-10, 13-15, 15-13తో కిమ్‌ జి జంగ్‌-షిన్‌ బేక్‌ జోడీపై విజయం సాధించి హంటర్స్‌కు శుభారంభాన్నిచ్చారు. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌ పోరులో లీ హ్యున్‌ 15-13, 11-15, 15-6 అజయ్‌ జయరాంపై విజయం సాధించాడు.

మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో హంటర్స్‌ 4-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే 'ట్రంప్‌' మ్యాచ్‌గా ఎంచుకున్న నాలుగో మ్యాచ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ ప్లేయర్‌ జు వీ వాంగ్‌ 11-15, 15-6, 15-6తో సాయిప్రణీత్‌ ఓటమి పాలయ్యాడు. దీంతో హైదరాబాద్ హంటర్స్ ఆధిక్యం 2-4కు తగ్గింది.

చివరిదైన ఐదో మ్యాచ్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోరులో సాత్విక్‌ సాయిరాజ్‌-బెర్నాడెత్‌ 15-8, 15-11తో చియోల్‌-ప్రజక్త జంటపై నెగ్గడంతో హంటర్స్‌ 5-2 ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో ముంబై రాకెట్స్‌ తలపడుతుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 25, 2017, 10:08 [IST]
Other articles published on Dec 25, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X