
హైదరాబాద్: మాజీ నెంబర్ వన్, మలేషియాకు చెందిన లీ చాంగ్ వుయి గురువారం అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు కళ్ల నుంచి ఉబికి వస్తోన్న కన్నీటి ధారలను ఆపుకుంటూ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ సందర్భంగా 36 ఏళ్ల లీ చాంగ్ వుయి మాట్లాడుతూ "రిటైర్మెంట్ ప్రకటించాలనే నిర్ణయం చాలా పెద్దది. ఆట అంటే నాకు ఎంతో ఇష్టం. గత 19 ఏళ్లుగా తనకు మద్దతు తెలుపుతోన్న అభిమానులకు ధన్యవాదాలు" అని అన్నాడు. లీ చాంగ్ వుయి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
వైద్యుల సూచన మేరకు లీ చాంగ్ వయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. లీ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గతేడాది జులైలో వెలుగు చూసింది. దీంతో ప్రస్తుతం అతడు తైవాన్‌లో అందుకు సంబంధించి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో లీ చాంగ్ సిల్వర్ పతకాలను సాధించాడు.
బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్ సింగిల్స్‌లో లీ రజత పతకాలను గెలిచాడు. ఆ తర్వాత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ స్వర్ణ పతకం మాత్రం నెగ్గలేకపోయాడు. లండన్, గాంగ్‌జూ, జకర్తాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు.