Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ టూర్ ఫైనల్స్: సింధుకు వరుసగా మూడో విజయం, సమీర్ వర్మ సంచలనం

BWF World Tour Finals: PV Sindhu, Sameer Verma Register Easy Wins To Enter Semifinals

హైదరాబాద్: చైనాలోని గ్వాంగ్జౌ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో సింధు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ప్రపంచ 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-9,21-15 స్కోరుతో ఘన విజయం సాధించింది.

దీంతో గ్రూప్ -ఏలో వరుసగా మూడు విజయాలు సాధించి అగ్రస్థానంతో వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సెమీస్ చేరింది. గ్రూప్‌-ఎ నుంచి సింధు, అకానె యమగూచి (జపాన్‌) సెమీస్‌కు అర్హత సాధించారు. తొలి మ్యాచ్‌లో ప్రపంచ టాప్-2 యమగుచి, రెండో మ్యాచ్‌లో టాప్-1 షట్లర్ తై జు యింగ్‌ను సింధు ఓడించిన సంగతి తెలిసిందే.

సెమీస్‌లో ఇంతనోన్‌తో తలపడనున్న సింధు

సెమీస్‌లో ఇంతనోన్‌తో తలపడనున్న సింధు

శనివారం జరిగే సెమీస్‌లో సింధు.. రచనోక్‌ ఇంతనోన్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడనుంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన సింధు ఈసారి ఎలాగైన చాంపియన్‌షిప్‌ను సాధించాలన్న పట్టుదలతో ఆడుతోంది. 35 నిమిషాల్లోనే బీవెన్‌జాంగ్‌ను ఓడించింది. తొలిగేమ్‌లో 4-0తో బీవెన్ జాంగ్ ఆధిక్యం చాటినా.. ఆ తర్వాత సింధు ఆటముందు నిలువలేకపోయింది. 6-6తో స్కోరు సమం చేసిన సింధు ఆ తర్వాత మరింత వేగంగా పాయింట్లు రాబట్టింది. సూపర్ ప్లేస్‌మెంట్స్, అద్భుతమైన స్మాష్‌లతో విరుచుకుపడింది.

తొలిగేమ్‌ను సింధు సొంతం చేసుకుందిలా

తొలిగేమ్‌ను సింధు సొంతం చేసుకుందిలా

17-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు సూపర్ స్మాష్‌తో మ్యాచ్ పాయింట్ వద్ద నిలిచింది. చివరకు జాంగ్ షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో తొలిగేమ్‌ను సింధు సొంతం చేసుకుంది. ఇక, రెండో గేమ్‌లోనూ సింధు చెలరేగిన ఆదిలో జాంగ్ నెట్ వద్ద అద్భుతంగా ఆడుతూ సింధును నిలువరించే ప్రయత్నం చేసింది. 2-6తో వెనుకబడినా 7-7తో స్కోరు సమం చేసి మళ్లీ పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. తొలి అర్థభాగంలో 11-9తో ఆధిక్యం అందుకున్న సింధు.. అదే జోరుతో జాంగ్‌ను నిలువరించింది.

వరుసగా మూడు విజయాలు సాధించడంపై సింధు

వరుసగా మూడు విజయాలు సాధించడంపై సింధు

16-12 స్కోరుతో సింధు ఆధిక్యం కొనసాగుతుండగా.. జాంగ్ కోర్టులో రాకెట్ నేలకు విసిరి అసహనం ప్రదర్శించింది. అయితే, సింధు మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఆడుతూ రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ "వరుసగా మూడు విజయాలు సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. గ్రూప్‌లో అగ్రస్థానం సాధించడంతో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది" అని చెప్పుకొచ్చింది.

సెమీస్‌లోనూ విజయం సాధిస్తా: సింధు

సెమీస్‌లోనూ విజయం సాధిస్తా: సింధు

"జాంగ్‌తో మ్యాచ్‌లో తొలుత వెనుకబడినా తన ఆటతీరుపై అవగాహన ఉండడంతో ఎలాంటి ఉద్వేగానికి గురి కాలేదు. గత టోర్నీలలో తనతో ఆడిన అనుభవంతో సునాయాసంగా విజయం అందుకున్నా. ఏకాగ్రత కోల్పోకుండా ఒత్తిడి దరిచేరనీయకుండా ఇదే ఉత్సాహంతో ఆడి సెమీస్‌లోనూ విజయం సాధిస్తాను" అని ధీమా వ్యక్తం చేసింది.

 సంచలన ప్రదర్శన చేసిన సమీర్ వర్మ

సంచలన ప్రదర్శన చేసిన సమీర్ వర్మ

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో తొలిసారి వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సమీర్‌వర్మ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా చేతిలో ఓడినా వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సెమీస్ స్థానం దక్కించుకున్నాడు. అరంగేట్రంలోనే అద్భుతమైన ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 44 నిమిషాలపాటు సాగిన చివరిలీగ్ మ్యాచ్‌లో కెంటాఫోన్ వాంగ్చారెన్‌ను 21-9,21-18 స్కోరుతో ఓడించాడు. సెమీస్‌లో షి యుకి (చైనా)తో సమీర్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

Story first published: Saturday, December 15, 2018, 10:33 [IST]
Other articles published on Dec 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+