Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుసగా రెండో పరాజయం.. బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ నుంచి సింధు నిష్క్రమణ!!

BWF World Tour Finals: PV Sindhu loses to Chen Yu Fei, out of semifinal contention

గ్వాంగ్‌ జౌ(చైనా): బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు నిరాశ పరిచింది. సెమీఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ సింధు పోరాడి ఓడిపోయింది. గురువారం గ్రూప్‌-ఎలో జరిగిన రెండో మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సింధు 22-20, 16-21, 12-21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ చెన్‌ యుఫీ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో యమగూచితో ఓడిన తరహాలోనే ఈ మ్యాచ్‌ను కూడా కోల్పోయింది.

72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో 17-20తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన సింధు వరుసగా ఐదు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను 22-20తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని యుఫీ 21-16తో నెగ్గి మ్యాచ్‌ ఫలితాన్ని చివరి గేమ్‌కు తీసుకెళ్లింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో చెన్‌ యుఫె తన దూకుడు కొనసాగించింది. ఓదశలో సింధు 4-8తో వెనుకబడినా.. చక్కటి పోరాటం కనబరిచి 10-10తో స్కోరును సమం చేసి పోటీలోకొచ్చింది. ఇక 12-12తో ఇరువురూ సమంగా ఉన్న దశలో యుఫీ వరుసగా 9 పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సైతం సొంతం చేసుకుంది.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడడంతో టోర్నీలో సింధు నాకౌట్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. మరో మ్యాచ్‌లో అకానె యామగుచి 25-27, 21-10, 21-13తో హి బింగ్‌జియావో (చైనా)పై గెలిచింది. గ్రూప్‌ ఎలో రెండేసి మ్యాచ్‌లు నెగ్గినందుకు చెన్‌ యుఫె, యామగుచి సెమీఫైనల్‌కు చేరారు. దీంతో శుక్రవారం హి బింగ్జియావోతో సింధు మ్యాచ్‌ నామమాత్రమే.

బుధవారం మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-ఏలో సింధు 21-18, 18-21, 8-21 తేడాతో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ అకానే యమగూచి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. గ్రూప్‌-ఏ మ్యాచ్‌ ముగిసిన తర్వాత సింధుకు డోప్‌ పరీక్ష నిర్వహించారు. గత రెండు నెలల్లో సింధుకు ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా), జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఆధ్వర్యంలో నాలుగు సార్లు (డెన్మార్క్, పారిస్, హైదరాబాద్‌) డోప్‌ టెస్టులు జరిగాయి.

Story first published: Friday, December 13, 2019, 8:15 [IST]
Other articles published on Dec 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+