న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైటిల్ గెలిచి చరిత్ర తిరగరాసిన సింధు

BWF World Tour Finals: PV Sindhu enters second successive final, Sameer Verma loses semifinal

చైనా: వరుసగా మూడోసారి ప్రపంచ టూర్ ఫైనల్స్ ఆడిన పీవీ సింధు అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్లింది. గతేడాది రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకున్న సింధు ఆ తర్వాత పెద్ద టోర్నీల్లో చాలాసార్లు ఫైనల్లో ఓడిపోయింది. వరుసగా రెండేళ్లు (2017, 2018) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. నిరుడు ప్రపంచ టూర్‌ తుది పోరులో ఓటమి తప్పలేదు. ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడల్లోనూ సింధుకు దక్కింది రజతమే. ఈ నేపథ్యంలో ఒకుహరతో ఫైనల్లో ఆమెపై తీవ్ర ఒత్తిడి ఉండటంలో సందేహం లేదు.

PV Sindhu Wins BWF World Tour Finals,Twitter Lauds India's Golden Girl | Oneindia Telugu

ఒకుహరతో 12 మ్యాచ్‌లు ఆడిన సింధు ఆరింట్లో మాత్రమే

గతంలో ఒకుహరతో 12 మ్యాచ్‌లు ఆడిన సింధు ఆరింట్లో నెగ్గింది. ఐతే నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పైచేయి ఒకుహరదే. ఆదివారం విజయం సాధించి.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అంతేకాదు ఈ ఏడాది సింగిల్స్‌లో తొలి టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. ఇలా భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది.

ఒకుహరపై సింధు అద్భుత పోరాటంతో

ఫైనల్లో రెండో సీడ్‌ ఒకుహర(జపాన్‌)పై సింధు అద్భుత పోరాటంతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలిచి ప్రత్యర్థిని మట్టికరిపించింది. తొలి గేమ్‌లో సింధు 14-6 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహారా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సింధు ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఒకుహారా రెండు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్‌ మాత్రమే సాధించింది. ఈ దశలో ఒకుహారీ నాలుగు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్‌ దక్కించింది. దాంతో స్కోరు 16-16 గా సమం అయ్యింది.

వరుస పాయింట్లతో దుమ్మురేపిన సింధు

అటు తర్వాత జోరు పెంచిన సింధు వరుస పాయింట్లతో దుమ్మురేపింది. తొలుత ఒక పాయింట్‌ సాధించి ఆధిక్యం సాధించిన సింధు.. వరుసగా రెండు స్మాష్‌లతో ముందంజ వేసింది. అదే జోరును తిరిగి కొనసాగించడంతో తొలి గేమ్‌ను సింధు దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు 3-0 తో పైచేయి సాధించింది. ఆపై సింధు రెండు పాయింట్లు, ఒకుహారా నాలుగు పాయింట్లు సాధించడంతో ఇరువురు మధ్య వ్యత్యాసం తగ్గింది.

చివరకు మ్యాచ్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా

సింధు మరోసారి విజృంభించి ఆధిక్యాన్ని సాధించింది. రెండో గేమ్‌లో ఎక్కడ ఆధిక్యాన్ని కోల‍్పోకుండా వచ్చిన సింధు చివరకు మ్యాచ్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా టైటిల్‌ను సాధించింది. నిరుడు ఫైనల్లో ఓడిన ఆమె ఈ సారి టైటిల్‌ను గెలిచి సత్తా చాటింది. ఈ ఏడాది సింగిల్స్‌లో సింధు ఖాతాలో తొలి టైటిల్‌ ఇదే కావడం విశేషం.

Story first published: Sunday, December 16, 2018, 12:24 [IST]
Other articles published on Dec 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X