లీ చోంగ్ వీ రికార్డు బద్దలు: ఒకే ఏడాదిలో 11 టైటిల్స్ నెగ్గిన తొలి షట్లర్‌గా కెంటో రికార్డు

హైదరాబాద్: ప్రపంచ నంబర్‌వన్, స్టార్ షట్లర కెంటో మొమోటా (జపాన్) ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి అరుదైన రికార్డుని నెలకొల్పాడు. బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాదిలో 11 టైటిల్స్ నెగ్గిన తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గ్రేట్ లీ చోంగ్ వీ(మలేసియా), వాంగ్ జియోలి-యు యాంగ్(చైనా) 10 టైటిళ్ల రికార్డుని అధిగమించాడు.
2010లో లీ చోంగ్ వీ సింగిల్స్ విభాగంలో 10 టైటిల్స్ నెగ్గగా... 2011లో వాంగ్ జియోలి-యు యాంగ్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో 10 టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది కెంటో మొమోటా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2019లో అతడు చైనా మాస్టర్స్, డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, జపాన్ ఓపెన్, ఆసియా ఛాంపియన్‌షిప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ ఆంథోనీని మట్టికరిపించి ఈ ఘనత సాధించాడు. 87 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో 17-21, 21-17, 21-14 తేడాతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాడు. ఫలితంగా ఈ ఏడాది మొమోటా 12 టోర్నీల్లో ఫైనల్స్ చేరగా 11 టోర్నీల్లో విజేతగా నిలిచాడు.
తొలి గేమ్‌లో ఓడిన కెంటో ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. మరోవైపు జిన్‌టింగ్ ఈ ఏడాది ఆడిన ఐదు ఫైనల్స్‌లో ఓటమిని మూటగట్టుకున్నాడు. ఈ టోర్నీ విజయంతో మొమోటాకు లక్షా 20 వేల డాలర్లు (రూ. 84 లక్షల 83 వేలు), రన్నరప్ జిన్‌టింగ్‌కు 60 వేల డాలర్లు (రూ. 42 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications