
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌షిప్, బ్యాట్మింటన్ లెజెండ్ లిన్ డాన్‌కు 21-11, 13-21, 21-7 పాయింట్లతో షాకిచ్చాడు.
లిన్ డాన్‌తో హోరా హోరీగా సాగిన తొలి గేమ్‌ను 21-11తో హెచ్‌ఎస్ ప్రణయ్ సొంతం చేసుకున్నాడు. అయితే, రెండో గేమ్‌లో అనూహ్యంగా పుంజుకున్న లిన్ డాన్ తన అనుభవాన్ని ఉపయోగించి ప్రణయ్‌పై 13-21తో విజయం సాధించాడు. ఇక, మ్యాచ్ విజేతను నిర్ణయించే మూడో గేమ్‌లో లిన్ డాన్ పూర్తిగా తేలిపోయాడు.
మూడో గేమ్‌ను 21-7 పాయింట్ల తేడాతో పాటు నెగ్గడంతో పాటు మ్యాచ్‌ని సైతం సొంతం చేసుకున్నాడు. తన బ్యాడ్మింటన్ కెరీర్‌లో లిన్ డాన్‌పై విజయం సాధించడం హెచ్ఎస్ ప్రణయ్‌కు ఇది మూడోసారి కావడం విశేషం. 2018లో జరిగిన ఇండోనేషియా ఓపెన్‌లో 21-15, 9-21, 21-14తో లిన్ డాన్‌పై నెగ్గిన ప్రణయ్... అంతకముందు 2015లో ఫ్రెంచ్ ఓపెన్‌లో 14-21, 21-11, 21-17 విజయం సాధించాడు.