BWF World Championship : పీవీ సింధు లేకున్నా ఈ సారి తోపు ప్లేయర్లున్నారు.. డోంట్ వర్రీ

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ బ్యాడ్మింటన్‌లో టాప్ టోర్నీ. బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్వహించే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ టోర్నీ ఈ నెల ఆగస్టు 22 నుంచి 28వరకు జపాన్లోని టోక్యోలో జరగనుంది. ఈ టోర్నీ బ్యాడ్మింటన్ క్రీడలోనే అత్యుత్తమ టోర్నీగా పిలవబడుతుంది. 1977 నుంచి ఈ టోర్నీ ప్రారంభమైంది. గడిచిన 45ఏళ్లలో 25సార్లు ఈ టోర్నీ జరగగా చైనా ఈ టోర్నీలో ఎప్పుడూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. భారత జట్టు ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క స్వర్ణం (పీవీ సింధు) ఈ టోర్నీలో సాధించగలిగింది.

తొలి పతకం అందించిన ప్రకాశ్ పదుకొనే
తొలి నాళ్లలో ప్రతి మూడేళ్లకోసారి ఈ టోర్నీ నిర్వహించేవారు. తర్వాత రెండోళ్లకోసారి.. ఆ తర్వాత ఏడాదికోసారి (సమ్మర్ ఒలింపిక్స్ సంవత్సరం మినహా) ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇక 1983లో భారత మాజీ బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే బ్రాంజ్ మెడల్ సాధించి.. భారత్ తరఫున బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్లో తొలి పతకాన్ని సాధించాడు.
ఈ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత ప్లేయర్‌గా కొనసాగుతుంది. అయితే ఈసారి పీవీ సింధు గాయం కారణంగా తప్పుకుంది. దీంతో ఈసారి భారత్‌కు పతకాలు వస్తాయా రావా అనే సంకోచం లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత రీతిలో మన బ్యాడ్మింటన్ స్టార్లు రాణిస్తుండడం ఇందుకు కారణం. కామన్ వెల్త్ గేమ్స్‌లో మన బ్యాడ్మింటన్ స్టార్లు తోపు పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

పీవీ సింధు లేకున్నా సింగిల్స్‌లో స్టార్లు
పీవీ సింధు లేకున్నా.. భారత్ తరఫున వుమెన్స్ సింగిల్స్‌లో మాళవిక బంసోద్, సైనా నెహ్వాల్ లాంటి స్టార్లు బరిలోకి దిగబోతున్నారు. మాళవిక ఉగాండా ఇంటర్నేషనల్, లిథునియాన్ ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలిచి కాస్త పతక ఆశలను కలిగిస్తోంది. ఇక మెన్స్ సింగిల్స్ విషయానికొస్తే.. ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్‌లో లక్ష్యసేన్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీకాంత్ కిదాంబి, సాయి ప్రణీత్, హెచ్ ఎస్ ప్రణయ్ లాంటి భారత టాప్ స్టార్లు సైతం బరిలోకి దిగుతున్నారు. దీంతో మెన్స్ సింగిల్స్‌లో పతకాలు వచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి.

డబుల్స్‌లోనూ పతక అవకాశాలు
మెన్స్ డబుల్స్‌లోనూ భారత ప్లేయర్లు మంచి ఫాంలో ఉన్నారు. సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ సాధించి అదే విజయోత్సాహంతో బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో దిగబోతున్నారు. వీరితో పాటు మను అట్రీ- బీ సుమీత్ రెడ్డి, అర్జున్ రామచంద్రన్ - ద్రువ్ కపిల, కృష్ణ ప్రసాద్ గరగ, విశ్వనాథ్ గౌడ్ పంజాల వుమెన్స్ డబుల్స్‌లో పోటీ పడనున్నారు. వుమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- సిక్కీ రెడ్డి, పూజా దండు - సంజన సంతోష్, త్రీష జోల్లీ - గాయత్రి గోపీచంద్, అశ్విని భట్-శిఖా గౌతమ్ బరిలోకి దిగబోతున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్‌సాగర్- తనీశా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవగన్... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications