BWF World Championship 2022 : నేటి నుంచే ప్రపంచ బ్యాడ్మింటన్ సమరం.. భారత కొదమ సింహాలు రెఢీ

భారత బ్యాడ్మింటన్ క్రీడాయోధులు జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యారు. అన్ని విభాగాల నుంచి మొత్తం 26 మంది భారత క్రీడాకారులు ప్రతిష్ఠాత్మక టోర్నీలో పాల్గొననున్నారు. ఇకపోతే ఈ మెగా ఈవెంట్లో విజయవంతమైన క్రీడాకారిణిగా పేరొందిన పీవీ సింధు గాయం కారణంగా దూరమవ్వడం భారత్‌కు కాస్త నష్టమే అయినా ఈసారి భారత బ్యాడ్మింటన్ స్టార్లు మంచి ఫాంలో ఉండడం కలిసొచ్చే అంశం. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టడం, అంతకుముందు థామస్ ఊబర్ కప్‌లోనూ మెన్స్ టీం టైటిల్ సాధించడం వల్ల ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ స్క్వాడ్ విజయోత్సాహంతో ఉంది. గతేడాది స్పెయిన్‌లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో మెన్స్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ రజతం సాధించగా.. లక్ష్య సేన్ కాంస్యం సాధించాడు.

నేడు మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో..
చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) వర్సెస్ సాయిప్రణీత్
ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) వర్సెస్ కిదాంబి శ్రీకాంత్
విటింగస్ (డెన్మార్క్) వర్సెస్ లక్ష్య సేన్
లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా) వర్సెస్ హెచ్ ఎస్ ప్రణయ్.
సాయిప్రణీత్ డ్రాపై భాగంలో ఉండగా.. శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ముగ్గురు డ్రా కింద ఉన్నారు. దీంతో ఈ ముగ్గురులో ఒకరే సెమీస్ చేరొచ్చు. కామన్వెల్త్‌లో గోల్డ్ సాధించిన లక్ష్య సేన్‌పై ఆశలు ఎక్కువగా ఉన్నాయి.

సైనా పైనే ఆశలు
వుమెన్స్ సింగిల్స్‌లో ఈసారి ఇద్దరే పోటీ పడనున్నారు. పీవీ సింధు గాయంతో రూల్ ఔట్ అయింది. ఇక స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్ సింగిల్స్‌లో తమ తడాఖా చూపించనున్నారు. నేడు తొలి రౌండ్‌లో లినె క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)తో మాళివిక తలపడనుంది. ఇక రేపు జరగబోయే తొలి రౌండ్‌లో చెయుంగ్ ఎన్గాన్ యి (వియత్నాం)తో సైనా బరిలోకి దిగనుంది. సైనా నెహ్వాల్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో ఇప్పటికే రెండు పతకాలు అందించింది. 2015లో సిల్వర్ మెడల్, 2017లో కాంస్యం అందించింది. ఈసారి కూడా ఆమెపైనే ఆశలు ఉన్నాయి.

ఈసారి మెన్స్ డబుల్స్‌పై ఫుల్ హోప్స్
మెన్స్ డబుల్స్‌లో ఇండియాకు ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒక్క మెడల్ కూడా రాలేదు. కానీ ఈసారి మాత్రం పతకంపై ఫుల్ హోప్స్ ఉన్నాయి. అందుకు కారణం సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ. గత కొంత కాలంగా ఈ జోడీ అద్భుతంగా రాణిస్తోంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు గోల్డ్ పతకాన్ని అందించింది. వీరి జోడీకి తొలి రౌండ్‌లో 'బై' లభించడం గమనార్హం. ఇక వుమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా పోటీనిచ్చే భారత ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు.

ఇక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఇండియా స్క్వాడ్
మెన్స్ సింగిల్స్ : లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్
వుమెన్స్ సింగిల్స్ : సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్
మెన్స్ డబుల్స్: సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి-మనూ అత్రి, అర్జున్-ధ్రువ్ కపిల, కృష్ణప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్.
వుమెన్స్ డబుల్స్: సిక్కి రెడ్డి- అశ్విని పొన్నప్ప, దండు పూజ - సంజన, పుల్లెల గాయత్రి - ట్రెసా జాలీ, అశ్విని భట్ - శిఖా
మిక్స్‌డ్ డబుల్స్ : ఇషాన్ - తనీషా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్ - జూహీ దేవాంగన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications