హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. దుబాయ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన గ్రూపు దశ తొలి మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ అకానె యామగుచిపై గెలిచింది. యమగూచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది.

తొలి గేమ్ కోల్పోయిన సింధు ఆ తర్వాత రెండో గేమ్‌లో అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నెగ్గింది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో జపాన్ షట్లర్ కాస్త ప్రతిఘటించినా ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా మూడో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
గురువారం రెండో మ్యాచ్‌లో చైనా షట్లర్ సున్ యుతో సింధు తలపడనుంది.