Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BWF Rankings: 5వ ర్యాంకులో సింధు, 8వ ర్యాంకులో సైనా

BWF Rankings: PV Sindhu, Saina Nehwal static at 5th, 8th spots in latest standings

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు 5వ ర్యాంకుని కైవసం చేసుకోగా, సైనా నెహ్వాల్‌ 8వ ర్యాంకులో నిలిచింది. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వీరిద్దరూ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ముగ్ధ అగ్రే, రితుపర్న దాస్‌లు మాత్రం తమ స్థానాలను మరింతగా మెరుగుపరుచుకుని 62, 65వ స్థానాలకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి రెండు స్థానాలు దిగజారి 24 ర్యాంక్‌కు పడిపోగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రనవ్‌ జెర్రీ చోప్రా- సిక్కి రెడ్డి 22వ స్థానంలో, పొన్నప్ప- రాంకిరెడ్డి జోడీ 23వ స్థానంలో నిలిచారు.

పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 10వ ర్యాంకులో ఉండగా... సమీర్‌ వర్మ 13న ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. జపాన్‌ ఓపెన్‌ సెమీఫైనల్స్‌లో కెంటో మొమొటా చేతిలో ఓడిపోయిన సాయి ప్రణీత్‌ నాలుగు స్థానాలు ఎగబాకి పురుషుల సింగిల్స్‌లో 20వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌(31), పారుపల్లి కశ్యప్‌(35), శుభంకర్‌దే(41), సౌరభ్‌, వర్మ(44) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి రెండు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకులో నిలవగా.... మను అత్రి-సుమిత్‌ రెడ్డిలు 25వ స్థానంలో నిలిచారు.

Story first published: Wednesday, July 31, 2019, 18:39 [IST]
Other articles published on Jul 31, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+