For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ర్యాంకులు పదిలంగా ఉంచుకున్న సింధు, సైనా, శ్రీకాంత్‌లు

BWF Rankings: No Change in Positions For Sindhu, Saina, Srikanth and Prannoy

హైదరాబాద్: ఇటీవలే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకుల్లో అగ్రశ్రేణి స్టార్లు అయిన పీవి సింధు, సైనా నెహ్వాల్, శ్రీకాంత్ వాళ్ల స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన టోర్నీల్లో.. ఎంతో శ్రమించి ఫైనల్ వరకూ పోరాడినా.. చివరకు ఖాళీ చేతుల్తో వెనుదిరగాల్సి వస్తోంది. అయినా శ్రమకు తగ్గ ప్రతిఫలం వారి ర్యాంకులపై ప్రభావం చూపెట్టింది. భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

థాయ్‌లాండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు తన మూడో స్థానాన్ని కాపాడుకుంది. ఇదే టోర్నీలో సైనా ఆరంభంలోనే తడబడి వెనుదిరిగింది. అయినా ఆమె గత 10వ ర్యాంకును నెహ్వాల్ పదిలం చేసుకున్నారు.

పురుషుల సింగిల్స్ జాబితాలో కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ వరుసగా 5, 11వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మరోవైపు సమీర్ వర్మ, బి.సాయి ప్రణీత్ చెరో పాయింట్ కోల్పోయి వరుసగా 19, 25వ స్థానాలకు పడిపోయారు. థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు చేరిన పారుపల్లి కశ్యప్ ఆరు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచారు.

మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, సిక్కీ రెడ్డి ఒక స్థానంలో పడిపోయి 28వ ర్యాంకులో నిలవగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్, పొన్నప్ప తొమ్మిది స్థానాలు ఎగబాకి 47వ ర్యాంకు సాధించారు. 16ఏళ్ల వైష్ణవీ జక్కా రెడ్డి నాలుగు స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్-50లోకి ప్రవేశించింది. కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 50వ స్థానంలో నిలిచింది.

బ్యాడ్మింటన్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్ షిప్ పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు భారత క్రీడాకారులు. జూలై 30నుంచి చైనాలో ఆరంభం కానున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఆటగాళ్ల డ్రాను ప్రకటించారు.
ఇందులో అవకాశం కుదిరితే సింధు.. ఒకుహరను ఓడించాలని పట్టుదలగా ఉంది. మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్లో బై లభించింది. రెండో రౌండ్లో జాక్వెట్‌ (స్విట్జర్లాండ్‌) లేదా ఆలియె (టర్కీ)తో సైనా తలపడుతుంది. అక్కడ్నుంచి సైనాకు గట్టి పోటీ ఎదురుకానుంది.

Story first published: Friday, July 20, 2018, 16:16 [IST]
Other articles published on Jul 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+