Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాలయ్య లయన్స్‌ జట్టుపై శ్రీకాంత్ స్టార్స్ విజయం

Balakrishna
అనంతపురం: తెలుగు సినీ నటుల క్రికెట్ అనంతపురం అభిమానులకు ఆదివారం పండుగ చేసింది. ఉత్కంఠభరితంగా జరిగిన సినీ తారల క్రికెట్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ నాయకత్వం వహించిన రాయలసీమ స్టార్స్‌ జట్టు బాలకృష్ణ నేతృత్వం వహించిన రాయలసీమ లయన్స్‌పై విజయం సాధించింది. క్రీసెంట్‌ క్రికెట్‌ కప్‌ పేరుతో ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో తొలిసారి ఈ మ్యాచ్ జరిగింది. పేద మహిళల సంక్షేమానికి తారలు ఈ మ్యాచ్ అడారు. నటుడు నాగార్జున టాస్‌ వేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంపిక చేసుకున్న రాయలసీమ స్టార్స్‌ జట్టు నిర్ణీత 25 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ లయన్స్‌ జట్టు చివరి బంతి వరకూ హోరాహోరీగా పోరాడినా రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్నింగ్స్‌ ధాటిగానే ఆరంభించినా మధ్య మధ్యలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. ప్రముఖ హీరోహీరోయిన్లు కదిలి వచ్చి అభిమానులకు కనువిందు చేశారు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు వీక్షకులకు కమెడియన్లు శ్రీనివాస రెడ్డి, టిల్లూ తమ వ్యాఖ్యానంతో అలరించారు.

నటుడు మురళీమోహన్‌, హీరోయిన్లు ఛార్మి, ప్రియమణి, కామ్నా జఠ్మలాని, అర్చన, సంజన, నికిషా పటేల్‌ హాజరయ్యారు. వారు కూడా కేరింతలు కొడుతూ డ్యాన్స్‌లు వేశారు. మ్యాచ్‌ అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచాలన్న ఉద్దేశంతోనే మ్యాచ్‌ ఆడామని, ఇక్కడికి వచ్చిన అందరు కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్టార్స్‌ కెప్టెన్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఎవరు గెలిచినా అందరం గెలిచినట్లే అన్నారు. మ్యాచ్‌లో తారలు తారకరత్న, రాజీవ్‌ కనకాల, తరుణ్‌, ఆదర్శ్‌, అయ్యప్ప, తనీష్‌, శివాజీరాజా, ఖయ్యూం, ఉదయ్‌ కిరణ్‌, అల్లరి నరేష్‌, నాని, శశాంక్‌, సాయిరవి, చిత్రం శ్రీను, శర్వానంద్‌, అజయ్‌, ఆర్యన్‌ రాజేష్‌, రాఘవేంద్ర, కార్తీక్‌, రమణ పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి నాగార్జునరెడ్డి, రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్‌ హాజరయ్యారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+