
హైదరాబాద్: చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ దూసుకెళ్తోంది. టోర్నీలో భాగంగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ రత్‌చనోక్ ఇంతనోన్‌పై వరుస గేమ్స్‌లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
సుమారు 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనా 21-16, 21-19 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లో అలవోక విజయాన్ని నమోదు చేసిన సైనాకు రెండో గేమ్‌లో ప్రత్యర్ధి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో గేమ్ మొదట్లో సైనా 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ఆ తర్వాత ఇంతనోన్ అనూహ్యంగా పుంజుకుంది.
దీంతో స్కోరును 19-19 దగ్గర సమం చేసింది. అయితే, ఈ దశలో సైనా అనుభవాన్ని ఉపయోగించి వరుసగా రెండు పాయింట్లు సాధించడంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది.