Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింధు 7: సైనాకు మకావు ఓపెన్ గోల్డెన్ ఛాన్స్

హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో రియో ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ర్యాంకుని మెరుగుపరచుకుంది. చైనా ఓపెన్ టైటిల్‌ను సాధించిన సింధు ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

తాజా విజయాలతో పీవీ సింధు రెండు స్ధానాల్ని మెరుగుపరచుకుని ఏడో ర్యాంకులో నిలిచింది. దీంతో ఆమె సూపర్ సిరీస్ ఫైనల్ ఈవెంట్‌లో ఆడేందుకు అర్హత సంపాదించింది. దుబాయిలో డిసెంబర్ 14 నుంచి 18 వరకు జరిగే జరిగే సూపర్ సిరీస్ టోర్నీలో టాప్-8 షట్లర్లు మాత్రమే బరిలోకి దిగుతారు.

దుబాయ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన నేపథ్యంలో మరింత ప్రాక్టీస్‌ కోసం సింధు మకావు ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలే ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ టాప్‌ 10 నుంచి నిష్క్రమించి 11వ ర్యాంకులో నిలిచింది.

Badminton World Rankings: P.V. Sindhu rises to No. 7

అయితే ప్రస్తుతం మకావు ఓపెన్‌లో ఆడుతున్న సైనా ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తే మళ్లీ టాప్‌ 10లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. తొలి మూడు స్థానాల్లో వరుసగా తై జు రుుంగ్ (చైనీస్ తైపీ), మారిన్ (స్పెరుున్), రత్చనోక్ (థాయిలాండ్) ఉన్నారు.

పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ఒక ర్యాంకును కోల్పోయి 13వ స్థానంలో నిలువగా, సమీర్ వర్మ 13 ర్యాంకుల్ని మెరుగుపర్చుకొని 30వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌లో మలేసియా స్టార్‌ లీ చోంగ్‌ వీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+