Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నా షెడ్యూల్‌లో పెళ్లికి ఒక రోజు మాత్రమే ఖాళీ ఉంది'

Badminton Star Saina Nehwal To Wed Parupalli Kashyap In December

న్యూ ఢిల్లీ: కొద్ది రోజుల ముందే తన ప్రేమ.. పెళ్లి వ్యవహారాన్ని బయటపెట్టిన సైనా నెహ్వాల్ ఇప్పుడు తేదీని కూడా నిర్ధారించింది. దాదాపు దశాబ్దకాలంగా సహచర షట్లర్ పారుపల్లి కశ్యప్‌తో ప్రేమలో ఉన్న సైనా నెహ్వాల్.. డిసెంబరు 16న తాము వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు వెల్లడించింది. డిసెంబరు 20 నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, ఆ తర్వాత టోక్యో గేమ్స్‌ క్వాలిఫయర్స్‌ ఉండటంతో.. ఈలోపు పెళ్లి తంతు పూర్తి చేసుకోవాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

టోర్నీల్లో ఆడుతూ.. ఇద్దరం కలిసి

టోర్నీల్లో ఆడుతూ.. ఇద్దరం కలిసి

2007 నుంచి ఈ బ్యాడ్మింటన్ జోడీ ప్రేమలో ఉన్నట్లు గత నెల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘బ్యాడ్మింటన్‌లో మా ప్రయాణం 2007-08లో మొదలైంది. అప్పటి నుంచి పెద్ద టోర్నీల్లో ఆడుతూ.. ఇద్దరం కలిసి శిక్షణ తీసుకునేవాళ్లం. అలా ఒకరి ఆట గురించి మరొకరు సలహాలు, సూచనలు చేసుకుంటూ స్నేహితులమయ్యాం. ఈ పోటీ ప్రపంచంలో అలా ఒకరికి క్లోజ్ కావడం చాలా కష్టం. కానీ.. మేము చాలా సులువుగా కలిసిపోయాం.

 పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు

పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు

అలా.. మాతో పాటు సుదీర్ఘకాలంగా మా బంధం కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే.. మేము ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఒకవేళ అలా ఆలోచిస్తే.. మా గేమ్ ఫోకస్ దెబ్బతింటుందని ఆందోళనచెందాం. ఇంట్లో అయితే.. నేను అడగకుండానే అన్నీ నాకు సమకూరుస్తారు. కానీ.. పెళ్లి అయితే.. నాకంటూ కొన్ని బాధ్యతలు వస్తాయి. కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌కి ముందు ఆ బాధ్యతలు తీసుకోవాలని నేను అనుకోలేదు.

డిసెంబరు 16వ తేదీ మాత్రమే షెడ్యూల్‌లో

డిసెంబరు 16వ తేదీ మాత్రమే షెడ్యూల్‌లో

అయితే.. ఇప్పుడు ఆ టోర్నీలు ముగిశాయి. అందుకే.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. డిసెంబరు 20 నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్.. ఆ తర్వాత టోక్యో గేమ్స్‌ క్వాలిఫయర్స్‌ మొదలవుతాయి. ఈ నేపథ్యంలో.. డిసెంబరు 16వ తేదీ మాత్రమే నా షెడ్యూల్‌లో పెళ్లికి తేదీ ఖాళీగా ఉంది'అని సైనా నెహ్వాల్ వెల్లడించింది.

ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన ప్లేయర్ సైనా

ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన ప్లేయర్ సైనా

సైనా జీవితం ఆధారంగా ‘సైనా' అనే సినిమా రాబోతోంది. సైనా పాత్రలో బాలీవుడ్‌ నటి శ్రధ్ధా కపూర్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన ఏకైక భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా. 2015లో ఈ ఘనత సాధించింది. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు సైనా బయోపిక్‌లో చూపించనున్నారు. సైనా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు ప‌తకాలు సాధించిన తొలి భార‌తీయ బ్యాడ్మింట‌న్‌ క్రీడాకారిణిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Story first published: Monday, October 8, 2018, 12:21 [IST]
Other articles published on Oct 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+