హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సహచరుల మధ్య జరిగిన పోరులో హెచ్‌ఎస్ ప్రణయ్‌పై కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రణయ్‌ను 14-21, 21-19, 21-18 తేడాతో ఓడించాడు.

తొలి గేమ్‌లో వెనకబడ్డ శ్రీకాంత్ రెండో గేమ్‌లో హోరాహోరీగా తలపడ్డాడు. ప్రణయ్ సైతం ఎంతో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే, చివరకు 21-19 తో రెండో గేమ్‌ను శ్రీకాంత్ గెలిచాడు. ఇక నువ్వా నేనా అన్నట్టు సాగిన మూడో గేమ్‌ను శ్రీకాంత్ 21-18తో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
పీవీ సింధు ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో 21-14, 21-9 తేడాతో సింధు ఓటమి పాలైంది.

తొలి రౌండ్‌లో హోరాహోరీ ప్రదర్శన కనబరిచినప్పటికీ, యమగుచి తనదైన శైలిలో విజృంభించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో గేమ్‌లో కూడా యమగుచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో సెమీస్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయ్యింది.