Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాడ్మింటన్‌కు మంచి రోజులొచ్చేశాయ్..: శ్రీకాంత్

Badminton: Srikanth predicts golden era for Indian stars with many in top 15 of rankings

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌కు త్వరలో స్వర్ణ యుగం వచ్చేస్తుందని హైదరాబాదీ స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ అంటున్నాడు. చైనా కంటే ఎక్కువ మంది మన భారత్ నుంచి రాబోతున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా భారత షట్లర్ల గురించి విశ్లేషించాడు. ''పురుషుల్లో మనకు ఆరుగురు మేటి షట్లర్లు ఉన్నారు. ఇక మహిళల సింగిల్స్‌లో వరల్డ్ ప్రపంచంలో నాలుగో స్థానంలో సింధు, పదకొండో స్థానంలో సైనా నెహ్వాల్ దూసుకెళ్తున్నారు. డబుల్స్‌లోనూ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు' అని తెలిపాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'ఇలా అన్ని విభాగాల్లోనూ మనకు చాలామంది నాణ్యమైన షట్లర్లు అందుబాటులో ఉన్నారు. గత పదేళ్లలో ఇదే అత్యుత్తమ భారత షట్లర్ల బృందం అని భావిస్తున్నా. మన బ్యాడ్మింటన్‌ స్వర్ణ యుగంలోకి అడుగుపెట్టబోతోంది. అందరం కలిసి కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాం'' అని శ్రీకాంత్‌ వాగ్దాటించాడు.

ఒలింపిక్స్‌లో పతకం గెలవడం తన అతి పెద్ద లక్ష్యమని, ఐతే ముందు రాబోయే టోర్నీలపై దృష్టి పెడుతున్నానని అతను చెప్పాడు. ''2020 క్రీడల గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు. ప్రస్తుతం నా దృష్టంతా కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించడంపైనే'' అని శ్రీకాంత్‌ తెలిపాడు.

ఒలింపిక్ కల:
2014లో జరిగిన చైనా ఓపెన్ టోర్నీలో శ్రీకాంత్ చైనీస్ గ్రేట్ షట్లర్ లిన్ డాన్‌ను ఓడించి పతకం గెలుచుకున్నాడు. రియో ఒలింపిక్స్‌లో సైతం క్యార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లి వెనుదిరిగాడు. ఇప్పటికే వరల్డ్ నెంబర్ 1 విక్టర్ అక్సెల్సెన్‌తో శ్రీకాంత్ ఏడు సార్లు పోటీపడితే.. కేవలం నాలుగు సార్లు మాత్రమే విక్టర్ గెలిచాడు. ఆ విషయానికి స్పందించిన శ్రీకాంత్ .. ర్యాంకింగ్స్ గురించి ఆలోచించి నాలో ఒత్తిడిని పెంచుకోదలచుకోలేదని అన్నాడు. ఒకవేళ ఆలోచిస్తే రిటైర్ మెంట్ అయ్యాకే అని పేర్కొన్నాడు.

Story first published: Friday, February 23, 2018, 11:45 [IST]
Other articles published on Feb 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+