చరిత్ర సృష్టించిన సింధు: కెరీర్లో తొలి సూపర్ సిరీస్ కైవసం
హైదరాబాద్: తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో ఘనత సాధించింది. తన కెరీర్‌లో తొలిసారి ప్రతిష్టాత్మక చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీని సాధించి చరిత్ర సృష్టించింది.
ఆదివారం ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో పదకొండో ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11 తేడాతో పదో ర్యాంకర్ సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
రియో పతక విజేత పీవీ సింధు గ్యాలరీ

తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధుకు రెండో గేమ్‌లో గట్టి పోటీ ఎదురైంది. దీంతో రెండో రౌండ్‌ను 17-21తేడాతో కోల్పోయింది. ఇక మూడో గేమ్‌లో దాదాపు ఆరు పాయింట్ల వరకూ సింధు-సున్ యులు సమంగా నిలిచారు. ఆ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత సున్ యుపై ఎదురుదాడి చేస్తూ చైనా క్రీడాకారిణిని ఒత్తిడిలో పడేసింది. దీంతో సున్ యు పదే పదే తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. ప్రత్యర్థిపై బలమైన షాట్లతో విరుచుకుపడి సింధు అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. చివరకు 21-11 తేడాతో మూడో రౌండ్ గెలుసుకుని చరిత్ర సృష్టించింది.
అరవై తొమ్మిది నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింధు విజయం సాధించడానికి చాలా తీవ్రంగా శ్రమించింది. ఈ విజయంతో తన ముఖాముఖి రికార్డును సింధు 3-3 తో సమం చేసింది. ఇదిలా ఉంటే సింధుకు కెరీర్‌లో ఇదే తొలి సూపర్ సిరిస్ కావడం విశేషం. ఈ విజయంతో సింధుకు 70000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించింది.
కాగా, గత ఏడాది డెన్మార్క్ ఓపెన్ సిరీస్ ఫైనల్‌కు చేరిన సింధు, చైనా క్రీడాకారిణి లీ జ్యుర్ చేతిలో ఓటమి పాలైంది. ఇక రియోలో ఒలంపిక్ పతకం సాధించిన తర్వాత పీవీ సింధు ఆ తర్వాత పాల్గొన్న రెండు టోర్నీల్లో కనీసం రెండో రౌండ్ కూడా దాటక పోవడం విశేషం.
అయితే చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆరో సీడ్ సుంగ్ జి హ్యున్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో సున్ యుతో తలపడి తన ఖాతాలోని చైనా ఓపెన్‌ను గెలుచుకుంది.
యువతరానికి ఆదర్శం: చంద్రబాబు
చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్స్ విజయం సాధించిన పీవీ సింధుకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు యువతరానికి సింధు గర్వకారణంగా నిలిచిందని అన్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి తొలిసారి చైనా ఓపెన్ సిరీస్ టైటిల్ సాధించడం గర్వంగా ఉందని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications