Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాడ్మింటన్: మరో ఘనత సాధించిన పీవీ సింధు

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరో ఘనతను సాధించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) సోమవారం (డిసెంబర్ 12) విడుదల చేసిన ఓ ప్రకటనలో పీవీ సింధుని 'ఈ ఏడాది అత్యంత మెరుగైన ప్లేయర్'గా పేర్కొంది.

ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్ షట్లర్ దుబాయిలో రిసెప్షన్‌తో పాటు గాలా డిన్నర్‌ను అందుకోనుంది. 'ఈ ఏడాది అత్యంత మెరుగైన ప్లేయర్' అవార్డుకు ఎంపిక అవడం పట్ల సింధు మీడియాతో మాట్లాడింది. ఈ అవార్డు సాధిస్తానని తాను ఊహించలేదని, ఎంతో సంతోషంగా ఉందని సింధు పేర్కొంది.

PV Sindhu named most improved player of 2016

ఇక దుబాయిలో జరగనున్న సూపర్ సిరిస్ పైనల్స్‌కు అర్హత సాధించడం పట్ల సింధు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించింది. నవంబర్ 20న తన కెరీర్‌లోనే తొలిసారి ప్రతిష్టాత్మక చైనా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బాడ్మింటన్‌ టోర్నీని సాధించి పీవీ సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది రియోలో జరిగిన ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా, గత ఏడాది డెన్మార్క్ ఓపెన్ సిరీస్ ఫైనల్‌కు చేరిన సింధు, చైనా క్రీడాకారిణి లీ జ్యుర్ చేతిలో ఓటమి పాలైంది.

రియోలో ఒలంపిక్ పతకం సాధించిన తర్వాత పీవీ సింధు ఆ తర్వాత పాల్గొన్న రెండు టోర్నీల్లో కనీసం రెండో రౌండ్ కూడా దాటక పోవడం విశేషం. ‌అయితే చైనా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బాడ్మింటన్‌ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్‌లో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+