Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఘనంగా వివాహం: సిక్కి రెడ్డి పెళ్లికి హాజరైన గవర్నర్ దంపతులు

 Badminton players sikki reddy and sumeeth reddy Marriage in Hyderabad

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ ప్లేయర్స్‌ సిక్కి రెడ్డి, సుమీత్‌ రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఇరు కుటుంబ సభ్యుల పెద్దలను ఒప్పించి వివాహబంధంతో ఒక్కటయ్యారు. శంషాబాద్‌ సమీపంలోని మల్లిక కన్వెన్షన్‌ హాల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, పీవీ సింధులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. కోదాడలో జన్మించిన సిక్కీ రెడ్డి భారత బ్యాడ్మింటన్‌లో డబుల్స్ క్రీడాకారిణిగా కొనసాగుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సిక్కీ రెడ్డి సభ్యురాలిగా ఉంది. ఇక, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం కూడా సాధించింది.

Story first published: Sunday, February 24, 2019, 11:12 [IST]
Other articles published on Feb 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+