Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వ్యాపారవేత్తను పెళ్లాడిన బ్యాడ్మింటన్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప (ఫోటోలు)

Badminton player Ashwini Ponnappa got married to businessman and model Karan Medappa

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్, మోడల్ అయిన కరణ్‌ మేడప్పను ఆమె వివాహం చేసుకుంది. కర్ణాటకలోని కొడగు జిల్లా కూర్గ్‌లో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

కొడవ సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతో పాటు పలువురు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అశ్విని పొన్నప్ప పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 1989 సెప్టెంబర్‌ 18న బెంగళూరులో జన్మించిన అశ్వని పొన్నప్ప.. భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉంది.

మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాలాతో కలిసి మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పలు అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రదర్శన చేసింది. కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకాన్ని, వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకాన్ని ఈ జోడీ సాధించింది.

Story first published: Sunday, December 24, 2017, 22:36 [IST]
Other articles published on Dec 24, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+