Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింధు సిగ్గరి, సైనాకు పట్టుదల ఎక్కువ: గోపీచంద్

Gopichand Training Saina And Sindhu at Separate Venues
Badminton Coach P Gopichand on the secret of Saina, Sindhus success: Never say ‘no’. Just go for it

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కార్యసాధకురాలని, ఆమె నోటి నుంచి 'కాదు' అనే సమాధానం ఎప్పుడూ రాదని భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో గోపీచంద్ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ అమ్మాయిలు ఏదైనా సాధించాలనుకుంటే.. పట్టుదల, ఏకాగ్రతతో సొంతం చేసుకుంటారని తన శిష్యులు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ను చూసిన తర్వాతనే తనకా విషయం అర్థమైందని వివరించారు.

సైనాకు పట్టుదల ఎక్కువ

సైనాకు పట్టుదల ఎక్కువ

తన దూకుడైన స్వభావంతో అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించాలనే పట్టుదల సైనాలో చూశానని తెలిపారు. భారత మహిళా షట్లర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలవగలరని, దానిని నిరూపించాలనే పట్టుదల సైనాలో తాను చూశానని గోపీచంద్ వెల్లడించారు.

ప్రత్యర్ధి ఎవరైనా సరే గెలుపే లక్ష్యంగా బరిలోకి

ప్రత్యర్ధి ఎవరైనా సరే గెలుపే లక్ష్యంగా బరిలోకి

'తన ప్రత్యర్ధి సీనియర్ ఇండియనా లేక వరల్డ్ నంబర్ 1, 2 లేదా 3 అనేది ఆలోచించదు. మ్యాచ్‌కి ముందు మా ఇద్దరి మధ్య సుదీర్ఘ సంభాషణలు, అరగంట సేపు లెక్చర్లు ఉండవు. తాను బరిలోకి దిగేటప్పుడు 'ప్రత్యర్ధిని ఓడిస్తాను'. మ్యాచ్ ముగిసిన తర్వాత 'నేను గెలిచాను' అని మాత్రమే చెబుతుంది' అని గోపీచంద్ తెలిపారు.

పీవీ సింధు విజయ రహస్యాన్ని బయటపెట్టిన గోపీచంద్

పీవీ సింధు విజయ రహస్యాన్ని బయటపెట్టిన గోపీచంద్

మరో స్టార్ షట్లర్ పీవీ సింధు విజయ రహస్యాన్ని కూడా గోపీచంద్ బయటపెట్టారు. 'నేను 4 గంటలకే లేచి ధ్యానం చేస్తా. ఆ తర్వాత 5.30 నుంచి సైనా, శ్రీకాంత్‌, మిగతా వారికి శిక్షణ ఉంటుంది. దీంతో సింధు కోసం తగిన సమయం ఉండేది కాదు' అని గోపీచంద్ వెల్లడించారు.

సింధుని ఉదయం 4.15కు రమ్మని చెప్పా

సింధుని ఉదయం 4.15కు రమ్మని చెప్పా

'ఆమె సబ్‌ జూనియర్‌ నేషనల్స్‌ ఆడడం మొదలుకాగానే.. నేను ధ్యానం చేయడం వదిలి సింధుని ఉదయం 4.15కు రమ్మని చెప్పా. అప్పటి నుంచి గత ఏడాది జనవరి వరకు ఆమె అదే సమయానికి వచ్చేది. సింధు స్వతహాగా సిగ్గరి కావడంతో.. కోర్టు మధ్యలో నిల్చుని గట్టిగా అరవాలని ఒత్తిడి చేసేవాడినని, అందుకు సింధు ఏడుస్తూ నిలబడి.. ఆ తర్వాత చెవులు చిల్లులు పడేలా గట్టిగా కేక పెట్టేది' అని గోపీచంద్ చెప్పారు. ఇక, తన అకాడమీలో అప్పటికీ, ఇప్పటికీ అకాడమీలో వచ్చిన మార్పుల గురించి చెబుతూ అప్పట్లో తన అకాడమీ ముందు సైకిళ్లు, స్కూటర్లు ఉండేవని, ఇప్పుడు చాలామంది కార్లలో వస్తున్నారని గోపీచంద్ చెప్పారు.

Story first published: Tuesday, May 29, 2018, 16:38 [IST]
Other articles published on May 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+