
హైదరాబాద్: భారత్ బ్యాడ్మింటన్‌కు ఇదొక బూస్టింగ్ లాంటింది. క్రీడా ఉత్పత్తుల తయారీ సంస్థ యోనెక్స్ సన్‌రైజ్‌తో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) రూ. 75 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 'బాయ్' ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని టోర్నీలకు యోనెక్స్ సంస్థ తమ ఉత్పత్తులను అందించనుంది.
ఈ ఒప్పందం ప్రకారం మూడేళ్ల పాటు భారత్‌లో 'బాయ్' నిర్వహించే అన్ని టోర్నీలకు ఆ సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయంపై 'బాయ్' అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ 'భారత బ్యాడ్మింటన్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న యోనెక్స్ సన్‌రైజ్‌కు ధన్యవాదాలు' తెలిపారు.
'ఈ నిర్ణయంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఒప్పందం వల్ల బాయ్ ఆర్ధికంగా కూడా బలపడుతుంది. దీంతో ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గొప్ప పురోగతి సాధించవచ్చు' అని అన్నారు. దేశంలోని అన్ని కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించగా యోనెక్స్ సన్‌రైజ్ ఈ అవకాశాన్ని దక్కించుకుంది.
ఈ ఒప్పందంపై బాయ్ కార్యదర్శి అజయ్ సింఘానియా మాట్లాడుతూ 'మన దేశంలో బ్యాడ్మింటన్ విస్తరించడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడనుంది' అని అన్నారు.