కాంస్యాలతో సరిపెట్టుకున్న సైనా, ప్రణయ్

హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత కథ ముగిసింది. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్‌ఎ్‌స ప్రణయ్ కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. సెమీఫైనల్ చేరి పసిడిపై ఆశలు రేపిన సైనా నెహ్వాల్, హెచ్.ఎస్. ప్రణయ్ తుది పోరుకు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. ఇద్దరూ కాంస్యంతో సరిపెట్టుకున్నారు. శనివారం ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సెమీస్‌లో సైనా 25-27, 19-21తో ప్రపంచ నంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది.

వరుసగా ఎనిమిదో ఓటమి:
సైనాకు ఇది వరుసగా ఎనిమిదో ఓటమి. ఈ సీజన్‌లో వరుసగా మూడోది. మ్యాచ్ ఆరంభంలో తైజు ఆధిపత్యం సాగింది. సైనా తడబాటును సొమ్ము చేసుకున్న ఆమె 11-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐతే ఆ తర్వాత సైనా అసాధారణ పోరాటంతో తైజును అందుకుంది. 15-15తో స్కోరును సమం చేసింది. అక్కడి నుంచి గేమ్ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. 20-18తో గేమ్‌ను సొంతం చేసుకునే అవకాశం సైనాకు లభించింది. ఐతే ఒత్తిడిలో తప్పులు చేసిన ఆమె నాలుగు అవకాశాలను వృథా చేసింది.

తైజు నాలుగో అవకాశాన్ని:
తైజు నాలుగో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గేమ్ దక్కించుకుంది. తొలి గేమ్‌ను తలపించిన రెండో గేమ్ కూడా ఆఖరివరకు హోరాహోరీగా సాగింది. ఐతే కీలక సమయంలో సైనా అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనాకు ఇది మూడో కాంస్యం.

హెచ్.ఎస్ ప్రణయ్ రికార్డు:
పురుషుల సింగిల్స్‌లో అనూప్ శ్రీధర్ (2007లో కాంస్యం) తర్వాత పతకం గెలిచిన భారత షట్లర్‌గా హెచ్.ఎస్ ప్రణయ్ రికార్డు సాధించాడు. ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో ప్రణయ్ 16-21, 18-21తో మూడో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

తొలి భారత పురుష షట్లర్ ప్రణయ్:
కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచిన నెహ్వాల్‌కు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఇది మూడో రజత పతకం కావడం విశేషం. మరోవైపు 2007లో అనూప్ శ్రీధర్ కాంస్యం గెలిచాక ఈ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన తొలి భారత పురుష షట్లర్ ప్రణయ్ కావడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications