Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌: సైనా, ప్రణయ్‌‌లు కాంస్యంతో సరి

 Badminton Asia Championships: Saina Nehwal and HS Prannoy claim bronze after battling defeats in semi-finals

హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లు కాంస్య పతకంతోనే సరిపెట్టుకున్నారు. చైనాలోని వుహాన్‌ వేదికగా జరుగుతోన్న ఈ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌‌లో సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కూడా నిరాశే మిగిల్చారు.

శనివారం జరిగిన సెమీ ఫైనల్లో వీరిద్దరూ ఓడిపోయారు. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సైనా టాప్‌సీడ్‌ తైజు యింగ్‌(తైపీ)తో తలపడింది. హోరాహోరీగా సాగిన పోరులో సైనా 25-27, 19-21 తేడాతో ఓడిపోయింది. తొలి సెట్ మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో తైజు గేమ్‌ పాయింట్‌ సొంతం చేసుకుంది.

దీంతో తొలిసెట్‌‌ను తైజు నెగ్గింది. ఇక రెండో సెట్‌ కూడా అలాగే సాగింది. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సమం చేసుకుంటూ ముందుకు సాగారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో సైనా 19-21తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుంది. తైజు యింగ్‌ చేతిలో సైనా ఓటమి పాలవడం ఇద 11వ సారి.

ఇప్పటి వరకు వీరిద్దరూ 16 సార్లు తలపడగా 11 సార్లు తైజు గెలవగా... ఐదు సార్లు మాత్రమే సైనా విజయం సాధించింది. ఇక, పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రణయ్‌ 16-21, 18-21తేడాతో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌(చైనా) చేతిలో పరాజయం చెందాడు. 52నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ప్రణయ్‌ 21-16, 18-21తేడాతో ఓటమి పాలయ్యాడు.

Story first published: Saturday, April 28, 2018, 18:21 [IST]
Other articles published on Apr 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+