ఆసియా ఛాంపియన్‌షిప్: క్వార్టర్స్‌కి దూసుకెళ్లిన సింధు
హైదరాబాద్: చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సత్తా చాటుతోంది. జపనీస్ క్రీడాకారిణితో బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది.
రెండో రౌండ్‌లో భాగంగా జపాన్ క్రీడాకారిణి అయా ఓహ్రీతో జరిగిన గేమ్‌లో 21-14, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. వుహున్ స్టోర్ట్స్ సెంటర్‌లో జరిగిన ఈ గేమ్‌లో రెండు సెట్లలో పీవీ సింధు అద్భుత ప్రదర్శన చేసింది.

సుమారు 40 నిమిషాల వ్యవధిలోనే సింధు తన ప్రత్యర్థిపై రెండు వరుస సెట్లలో విజయం సాధించి గేమ్‌ను గెలుచుకుంది. క్వార్టర్స్‌లో భాగంగా పీవీ సింధు చైనా క్రీడాకారిణి బింగ్‌జియోతో తలపడనుంది.
ఇక పురుషుల సింగిల్స్ విషయానికి వస్తే భారత్ పోరు ముగిసింది. చైనీస్ తైపీ క్రీడాకారుడు సు జెన్‌తో తలపడిన అజయ్ జయరాం 19-21, 10-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇదిలా ఉంటే, మొదటి రౌండ్‌లో ఓటమిపాలైన సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications