For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైడ్ అయిపోయిన సిక్కీ జోడీ, సాయి ప్రణీత్‌లు

B Sai Praneeth, Ashwini Ponnappa-N Sikki Reddy out of Malaysia Masters

హైదరాబాద్: మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో హైదరాబాదీ సాయిప్రణీత్‌ 17-21, 8-21 తేడాతో ప్రపంచ చాంపియన్‌ విక్టర్‌ ఆక్సెల్సెన్‌ చేతిలో చిత్తయ్యాడు.

28 నిమిషాల్లోనే ముగిసిన ఈ రెండో రౌండ్‌ తొలి గేమ్‌లో ప్రణీత్ ప్రతి పాయింట్‌కు చాలా జాగ్రత్తగా ఆడాడు. కాస్త పోరాటం ప్రదర్శించినా ఆ తర్వాత గేమ్‌లో మాత్రం దారుణ ఆటతీరుతో సా యిప్రణీత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇక మహిళల డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 35 నిమిషాల్లో ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. 15-21, 15-21 తేడాతో కమిల్లా రైటర్‌-క్రిస్టినా పెడర్సన్‌ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 19, 2018, 11:25 [IST]
Other articles published on Jan 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+