
హైదరాబాద్: ఫైనల్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ విజయం సాధించింది. పీబీఎల్ రెండో సెమీ పైనల్లో భాగంగా శనివారం బెంగళూరు 4-3తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌పై విజయం సాధించింది.
తొలి మ్యాచ్‌లో చాంగ్ ఫెంగ్ 2-15, 15-14, 10-15తో సౌరభ్‌వర్మ చేతిలో ఓటమిపాలైంది.
దీంతో బెంగళూరు బ్లాస్టర్స్ 0-1తో వెనుకబడింది. ఇక, పురుషుల డబుల్స్‌ను బ్లాస్టర్స్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మథియస్- కిమ్ రాంగ్ 15-13, 15-12తో నందగోపాల్-లీ రెజినాల్డ్‌పై విజయం సాధించింది. దీంతో
బెంగళూరు బ్లాస్టర్స్ 2-1తో ఆధిక్యం సంపాదించింది.
ఇక, మూడో మ్యాచ్ మహిళల సింగిల్స్‌ను అహ్మదాబాద్ ట్రంప్ మ్యాచ్‌గా నిర్ణయించింది. ఈ మ్యాచ్‌లో గిల్మూర్ (బ్లాస్టర్స్) 15-8, 13-15, 8-15తో తై జు యింగ్ చేతిలో ఓడింది. ఫలితంగా అహ్మదాబాద్ 3-2తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సెన్ 15-11, 15-14తో ప్రణయ్‌పై విజయం సాధించాడు.
దీంతో ఇరుజట్లు 3-3తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక మిక్స్‌డ్ డబుల్స్‌లో బ్లాస్టర్స్ జోడీ సిక్కిరెడ్డి- కిమ్ రాంగ్ 15-12, 13-15, 15-9తో కమిలా- హిమ్‌పై గెలవడంతో 4-3తో మ్యాచ్‌ని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో హైదరాబాద్ హంటర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది.
మ్యాచ్ ఫలితం: బెంగళూరు బ్లాస్టర్స్ vs అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్
Men's Singles: Chong Wei Feng lost to Sourabh Verma 2-15, 15-14, 10-15
Men's Doubles: (T) Kim Sa Rang/Mathias Boe bt Lee Chun Hei Reginald/K Nandagopal 15-13, 15-12.
Women's Singles: Kristy Gilmour lost to Tai Tzu Ying (T) 15-9, 13-15, 8-15
Men's Singles: Victor Axelsen bt HS Prannoy 15-11, 15-14
Mixed Doubles: Kim Sa Rang/Sikki Reddy bt Law Cheuk Him/Kamilla Rytter Juhl 15-12, 13-15, 15-9
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.