For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్: స్మాష్‌ మాస్టర్స్‌ను చిత్తు చేసిన అవధె వారియర్స్‌

Awadhe Warriors

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నాలుగో సీజన్‌లో అవధె వారియర్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌ 6-(-1)తో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ను చిత్తుచేసింది.

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్

అవధె ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకొన్న మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో బీవెన్‌ 10-15, 15-11, 15-11తో గిల్మోర్‌పై గెలిచి జట్టుకు శుభారంభం అందించింది. ఆ తర్వాత జరిగిన పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో యాంగ్‌ లీ-క్రిస్టియాన్సెన్‌ జోడీ 15-12, 10-15, 15-6తో నందగోపాల్‌- సాత్విక్‌ జోడీపై నెగ్గింది.

పురుషుల సింగిల్స్‌లో సన్‌ వాన్‌ హో (అవధ్‌) 15-7, 8-15, 15-10తో అక్సెల్‌సన్‌ను ఓడించడంతో 4-0తో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే అవధె విజయం ఖరారైంది. అహ్మదాబాద్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకొన్న పురుషుల సింగిల్స్‌లోనూ అవధె విజయం సాధించింది.

సౌరభ్‌ వర్మ 8-15, 12-15తో లీ డాంగ్‌ క్యున్‌ (అవధ్‌) చేతిలో చిత్తుగా ఓడాడు. చివరగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-సిక్కి రెడ్డి జోడీ 15-13, 10-15, 12-15తో క్రిస్టియాన్సన్‌-అశ్విని పొన్నప్ప జోడీ చేతిలో ఓడింది.

పీబీఎల్‌లో శనివారం
ముంబయి రాకెట్స్‌ Vs చెన్నై స్మాషర్స్‌ (సా. 4 నుంచి)
బెంగళూరు రాప్టర్స్‌ Vs నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ (రాత్రి 7 నుంచి)

Story first published: Saturday, January 5, 2019, 8:35 [IST]
Other articles published on Jan 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+