For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జకోవిచ్‌ను వణికించిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు - పోరాడి ఓడిన బసవరెడ్డి

నోవాక్ జకోవిచ్‌ - నిశేష్‌ బసవారెడ్డి మధ్య తొలి రౌండ్‌ రసవత్తరంగా సాగింది. తెలుగు మూలాలున్న 19 ఏళ్ల కుర్రాడు నిశేష్ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఈ రౌండ్ లో గట్టిగా పోరాడినప్పటికీ చివరికి ఓడిపోయాడు. దీంతో జకోవిచ్ తొలి రౌండ్ లో 4-6 6-3 6-4 6-2 విజయం సాధించి రెండో రౌండ్ కు అర్హత సాధించాడు.

తొలి రౌండ్ లో తెలుగు కుర్రాడు జోరు

తొలి సెట్ లో నిశేష్ దూకుడు ప్రదర్శించాడు. పెద్దగా అనుభవం లేనప్పటికీ, ఈ తెలుగు సంతతి కుర్రాడు మాజీ వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్ కు గట్టిపోటీనిచ్చేలా ఆడాడు. అతడి జోరుకు జకోవిచ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నిశేష్ 4-6 తేడాతో పైచేయి సాధించాడు. కానీ ఆ తర్వాత సెట్లలో జకోవిచ్ పుంజుకోవడంతో నిశేష్ కు నిరాశ ఎదురైంది. 6-3 6-4 6-2 జకోవిచ్ గెలిచాడు. ఏదేమైనా స్టార్ ప్లేయర్ పై తొలి రౌండ్ లోనే విజయం సాధించిన నెల్లూరు కుర్రాడిపై తెలుగు క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వైల్డ్‌కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడు, ర్యాంకింగ్స్‌లో 133వ స్థానంలో ఉన్నప్పటికీ... ప్రపంచ మేటీ ఆటగాడినే వణికించడం గమనార్హం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Australian Open 2025 Novak Djokovic beats 19-year-old Indian-origin tennis player Nishesh Basavareddy in first round

ఇకపోతే నిశేష్ పై జకోవిచ్ కూడా ప్రశంసలు కురిపించాడు. అద్భుతంగా పోరాడడంటూ కితాబిచ్చాడు. మ్యాచ్ చివరి వరకు నిశేష్ కనబర్చిన పోరాట పటిమ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు. అతడి ప్రదర్శన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించాడు. కెరీర్ లో నిశేష్ అత్యుత్తమంగా రాణించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.

కాగా, రౌండో రౌండ్ లో జకోవిచ్ 21 ఏళ్ల పోర్చగీస్ జేమీ ఫారియాతో (Jaime Faria) తలపడనున్నాడు. ఈ టోర్నీలో ఎలాగైనా గెలిచి 25వ టైటిల్ ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.

Story first published: Monday, January 13, 2025, 18:31 [IST]
Other articles published on Jan 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+