షట్లర్ల శుభారంభం, దుష్యంత్‌కు కాంస్యం(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ తన ప్రత్యర్ది టెంగ్ లుక్ యు (మకావు)పై వరుసగా 21-10, 21-8లతో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ కేవలం 26 నిమిషాల్లోనే సైనా ముగించింది.
ఆసియా గేమ్స్‌కు ముందు సైనా నెహ్వాల్ తన గురువుగా హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ని కాదని బెంగుళూరుకు చెందిన జాతీయ హెడ్ కోచ్ విమల్ కుమార్‌ని ఎంపిక చేసుకోవడంతో తన ఆట తీరుపై ఏమైనా ప్రభావం చూపుతుందని భావించారు అభిమానులు.
ఐతే.. అలాంటివాటన్నింటిని పటాపంచలు చేసి విజయాన్ని నమోదు చేసింది సైనా. ప్రపంచ ర్యాంకింగ్‌లో ఏడవ స్దానంలో ఉన్న సైనా ఆది నుంచి కూడా రెండు సెట్లలో పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో గురువారం నాడు సైనా ఇరాన్‌కు చెందిన సోరయాతో తలపడనుంది.
ఇక పివి సింధు విషయానికి వస్తే తన ప్రత్యర్ది కిట్ లెంగ్ వాంగ్ (మకావు)పై 21-17, 21-13తో గెలిచింది. పురుషుల డబుల్స్ లో సుమీత్ రెడ్డి, మను అత్రి కూడా ముందంజలో ఉన్నారు. ప్రద్న్య, సిక్కిరెడ్డి జోడీ 21-16, 21-4తో నేపాల్ జోడీ సిచ్యా శ్రేష్ట, పూనం గురుంగ్ పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ లో సుమీత్, అత్రి 21-7, 21-7తో మాల్దీవులకు చెందిన నషీవు షరాఫుద్దీన్, మహ్మద్ సరీమ్ పై నెగ్గింది.

భారత షట్లర్ల శుభారంభం
ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. ప్రద్న్య, సిక్కిరెడ్డి జోడీ 21-16, 21-4తో నేపాల్ జోడీ సిచ్యా శ్రేష్ట, పూనం గురుంగ్ పై విజయం సాధించింది.

భారత షట్లర్ల శుభారంభం
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ తన ప్రత్యర్ది టెంగ్ లుక్ యు (మకావు)పై వరుసగా 21-10, 21-8లతో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ కేవలం 26 నిమిషాల్లోనే సైనా ముగించింది.

భారత షట్లర్ల శుభారంభం
పురుషుల డబుల్స్ లో సుమీత్ రెడ్డి, మను అత్రి కూడా ముందంజలో ఉన్నారు.

భారత షట్లర్ల శుభారంభం
పురుషుల 56కేజీల ప్రిలిమినరీ విభాగంలో పాల్గొనున్న పుజిలిత్ శివ్ తాపాకు సహాయం చేస్తున్న కోచ్.
బుధవారం జరిగిన పురుషుల రోవర్ విభాగంలో దుష్యంత్ దుషియంత్ కాంస్యం గెలుచుకున్నాడు. 2000మీటర్ల విభాగంలో 7:26.57 టైమింగ్‌తో పూర్తి చేసి మూడవ స్దానంలో నిలవడంతో కాంస్య పతకం ఖచ్చితమైంది.
ఆసియా క్రీడల్లో చైనా మొదటి స్థానంలో నిలవగా, కొరియా రెండో స్థానంలో, భారత్ 14వ స్థానంలో నిలిచింది. చైనా 48- స్వర్ణం, రజతం -25, కాంస్యం -22 పతకాలను గెలుచుకుంది. కొరియా 23 స్వర్ణం, 22- రజతం, 22 - కాంస్యం పతకాలను ఖాతాలో వేసుకుంది. భారత్ తన ఖాతాలో 12 పతకాలు వేసుకుంది. స్వర్ణం-1, రజతం-1, కాంస్యం -10 పతకాలు వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications