Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా గేమ్స్‌: రెండో రౌండ్‌లో ఓటమి, ముగిసిన శ్రీకాంత్ పోరాటం

Asian Games 2018: Srikanth crashes out in second round in badminton

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. ఈ ఏడాది గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకంతో మెరిసిన శ్రీకాంత్.. ఆసియా గేమ్స్‌లోనూ అదే జోరుని కొనసాగిస్తాడని అంతా ఆశించారు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

అయితే, ఆసియా గేమ్స్‌లో భాగంగా శుక్రవారం పురుషుల సింగిల్స్‌లో పోటీపడిన కిదాంబి శ్రీకాంత్ 21-23, 19-21 తేడాతో హాంకాంగ్‌ చెందిన షట్లర్ వాంగ్ వింగ్ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఈ ఆసియా గేమ్స్‌‌లో రెండో రౌండ్‌లోనే శ్రీకాంత్ ఓటమితో ఇంటిదారి పట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభ నుంచి గట్టి పోటీనిచ్చిన శ్రీకాంత్ చిన్నపాటి తప్పిదాలు చేశాడు.

దీంతో ఒత్తిడికి లోనై ఓటమిపాలయ్యాడు. ఆసియా గేమ్స్ ఆరంభంలో జరిగిన బ్యాడ్మింట్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ జట్టు ఓడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీకాంత్ ఓటమితో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పతకం ఆశలన్నీ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌పైనే ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పటికే రెండో రౌండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, August 24, 2018, 18:06 [IST]
Other articles published on Aug 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+