
జకార్తా: ఇండోనేషయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఊహించని దెబ్బ తగిలింది. బ్యాడ్మింటన్ మహిళల టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం రేసులో ఉన్న భారత జట్టు క్వార్టర్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసియా గేమ్స్ పోటీల్లో భాగంగా క్వార్టర్స్‌లో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
తొలి రౌండ్లో బై వచ్చిన భారత్ సోమవారం క్వార్టర్స్‌లో జపాన్‌తో తలపడింది. తొలి మ్యాచ్‌లో భాగంగా పీవీ సింధు-యమగూచిల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో యమగూచిపై 21-18, 21-19తో యమగూచిపై విజయం సాధించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చింది.
అయితే, ఆ తర్వాత భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో మహిళల టీమ్ ఈవెంట్ నుంచి భారత నిష్ర్కమించింది. ఆ తర్వాత డబుల్స్‌లో సిక్కిరెడ్డి- ఆరతి 15-21, 6-21తో ఓడిపోవడంతో బ్యాడ్మింటన్ విభాగంలో టీమ్ ఈవెంట్ పోటీల్లో భారత్ ఆధిక్యానికి తెరపడింది.
మరో సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 11-21, 25-23, 16-21 తేడాతో ఒకుహార చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు-పొన్నప్ప జోడీ మిసకి ముట్సుటోమో-ఆయాకా టకహాషి చేతిలో ఓడిపోయింది.
దీంతో, ఈ ఆసియా గేమ్స్‌లో మహిళల టీమ్ ఈవెంట్లో భారత క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. కాగా, 2014లో ఇంచియాన్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత మహిళల జట్టు కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే.