ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌: తప్పుకున్న సైనా, భారమంతా సింధుపైనే

Asia Team Badminton Championship: Sindhu to spearhead Indian challenge in Saina’s absence

హైదరాబాద్: ఇండియా ఓపెన్ ఫైనల్ ఓటమి మరిచిపోకముందే భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. బుధవారం ఆరంభమయ్యే ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఫిట్ నెస్ సమస్యలతో టోర్నీ నుంచి ఇప్పటికే సైనా నెహ్వాల్ తప్పుకుంది.

మార్చి 14 నుంచి 18 వరకు బర్మింగ్‌హామ్ వేదికగా ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ జరగనున్న నేపథ్యంలో అప్పటికల్లా ఫిట్‌నెస్ సమస్యలను అధిగమించాలనే సైనా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ముగిసిన ఇండియా ఓపెన్‌లో సైనా క్వార్టర్ ఫైనల్స్‌‌లో వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

ఇక, సైనా లాగే ప్రణయ్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో మలేసియా వేదికగా జరగనున్న ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల్లో పీవీ సింధు, పురుషుల్లో కిదాంబి శ్రీకాంత్‌లపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. గ్రూప్‌-డిలో ఉన్న పురుషుల జట్టులో శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, సమీర్‌ వర్మ, సుమీత్‌ రెడ్డి, మను అత్రి ఉన్నారు.

మహిళల్లో పీవీ సింధు, శ్రీకృష్ణప్రియ, రుత్విక గద్దె, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రజక్త సావంత్‌, సంయోగిత ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. టోర్నీలో భాగంగా సింధు డబుల్స్ ఆడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. గ్రూప్‌ దశలో పురుషుల జట్టు ఫిలిప్పీన్స్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఇండియాకు కఠిన డ్రా ఎదురైనట్లు తెలుస్తోంది. గ్రూప్‌ డబ్ల్యూలో జపాన్‌, హాంకాంగ్‌లతో భారత్‌ తలపడాల్సి ఉంది. గ్రూప్ డిలో భాగంగా భారత్‌కు ఇండోనేషియాతో డ్రా పడినప్పటికీ, ఫిలిఫ్పేన్స్‌తో పాటు మాల్దీవులు కూడా ఉన్నాయి. ఈ టోర్నీని మే 20 నుంచి జరిగే ప్రతిష్టాత్మక థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌కు క్వాలిఫయర్‌గా పరిగణించే సంగతి తెలిసిందే.


మహిళల జట్టు: PV Sindhu, Ruthvika Shivani, Krishna Priya (WS), Ashwini Ponappa and Sikki Reddy, Prajakta Sawant and Sanyogita and Rituparna Das and Mithila UK (WD).

మ్యాచ్‌లు:

India beat Hong Kong 3-2 on Tuesday

India vs Japan on Thursday, February 8 [9am local time, 6:30am IST, 1am GMT]

Women's teams - Full list (Defending champions: China)

Group W: Japan, India, Hong Kong

Group X: South Korea, Chinese Taipei, Maldives

Group Y: Thailand, Malaysia, Vietnam, Philippines

Group Z: China Indonesia, Singapore


పురుషుల జట్టు: Kidambi Srikanth, Sai Praneeth, Sameer Verma (MS), Satwiksairaj Rankireddy and Chirag Shetty, Manu Attri and B Sumeeth Reddy, Shlok Ramachandran and MR Arjun (MD).

మ్యాచ్‌లు:

* India vs Philippines on Tuesday, February 6 [7pm local time, 4:30pm IST, 11am GMT]

* India vs Indonesia on Wednesday, February [7pm local time, 4:30pm IST, 11am GMT]

* India vs Maldives on Thursday, February 8 [7pm local time, 4:30pm IST, 11am GMT]

పురుషుల జట్టు - పూర్తి వివరాలు (డిఫెండింగ్ ఛాంపియన్స్: ఇండోనేషియా)

Group A: China, Hong Kong, Singapore

Group B: Japan, South Korea, Nepal, Kazakhstan

Group C: Chinese Taipei, Malaysia, Thailand, Myanmar

Group D: Indonesia, India, Philippines, Maldives


Live streaming and TV coverage:

* India: TV: DSport (From QF); Live streaming: Watch DSport; DSport on Jio TV, Airtel TV

* Malaysia: TV: Astro Supersport 4; Live streaming: Astro Go

* Live scores of all the matches can be found here.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, February 6, 2018, 13:25 [IST]
Other articles published on Feb 6, 2018
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more