For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్స్‌లో సైనా, సింధు

Asia Badminton Championships: PV Sindhu, Saina Nehwal, Sameer Verma Win In Straight Sets; Enter Quarterfinals

హైదరాబాద్: చైనాలోని వుహాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, సమీర్ వర్మలు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్‌ ప్రిక్వార్టర్‌ పోరులో సైనా, సింధులు వరుస సెట్లలో తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు 21-15, 21-19 తేడాతో ఇండోనేషియాకు చెందిన చోరన్నిసాపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో పీవీ సింధు చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 17 ర్యాంకర్ కాయ్ యానన్‌తో తలపడనుంది. మరోవైపు సైనా నెహ్వాల్‌ 21-13, 21-13 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ గా ఎన్‌పై విజయం సాధించింది.

ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లో తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న జపాన్‌కు చెందిన ఆకానె యమగూచితో తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ 21-12, 21-19 తేడాతో హాంకాంగ్‌కు చెందిన కా లాంగ్‌ ఆంగస్‌పై విజయం సాధించాడు.

ఇక, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఉక్రోష్ ఆరోరా-కరిస్మా వాడ్కర్‌ల జోడీ ఇండోనేషియాకు చెందిన హఫీజ్ ఫైజల్-గ్లోరియా ఎమనుల్లే జోడీ చేతిలో 10-21, 15-21తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Story first published: Thursday, April 25, 2019, 18:58 [IST]
Other articles published on Apr 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+