
హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, సమీర్ వర్మ టోర్నీ నుంచి నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ సింధు, ఏడో సీడ్ సైనా... పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ ఓడిపోయారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిదో ర్యాంకర్ సైనా 13-21, 23-21, 16-21తో ఓడింది. మొత్తంగా యామగుచి చేతిలో సైనాకిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. 69 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మూడో గేమ్‌లో ఒకదశలో 11-6తో, 14-11తో ఆధిక్యంలో నిలిచింది.
అయితే, ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. మరో మ్యాచ్‌లో సింధు 19-21, 9-21తో కై యన్యాన్ (చైనా) చేతిలో కంగుతింది. 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మెరుగ్గా ఆడిన సింధు రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ 10-21, 12-21తో చైనాకు చెందిన రెండోసీడ్ షి యుకీ చేతిలో ఓడాడు.