రూ. 2 కోట్లు, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం: శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం నజరానా
హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలిచిన తెలుగు షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అభినందించింది. శ్రీకాంత్ స్ఫూర్తిదాయక విజయాన్ని అభినందిస్తూ రూ.2 కోట్ల నగదు బహుమానం అందించాలని, గ్రూప్-1 అధికారి (డిప్యూటీ కలెక్టర్)గా ఉద్యోగం కల్పించాలని, అమరావతిలో వెయ్యి గజాల స్ధలం ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు తాజాగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ. 15 లక్షలు, ఎలైట్ లెవెల్ కోచ్ సుధాకర్‌రెడ్డికి రూ 11,25,000, మరో కోచ్ శ్రీకాంత్‌కు రూ 3,75,000 ఇవ్వాలని మంత్రి మండలి బుధవారం తీర్మానించింది.

ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా శ్రీకాంత్
ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకున్న తొలి భారత ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించడాన్ని మంత్రిమండలి ప్రశంసించింది. డెన్మార్క్ ఓపెన్ టైటిట్ నెగ్గిన శ్రీకాంత్ వారం రోజుల వ్యవధిలోనే ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిల వడం అతడి ప్రతిభకు నిదర్శనంగా పేర్కొంది.

యువ క్రీడాకారులకు స్ఫూరిదాయకం
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు లీ చాంగ్ వీ, లిన్ డాన్, చెన్ లాంగ్ సరసన శ్రీకాంత్ నిలవడం యువ క్రీడాకారులకు స్ఫూరిదాయకమని మంత్రి మండలి అభివర్ణించింది. అతడు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. రెండు వారాల వ్యవధిలో డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లు నెగ్గిన శ్రీకాంత్.. మంగళవారం నగరానికి తిరిగి వచ్చాడు.

శంషాబాద్ విమానాశ్రయంలో శ్రీకాంత్‌కు ఘన స్వాగతం
ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో శ్రీకాంత్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గోపీచంద్ అకాడమీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీకాంత్ సహా, కోచ్ గోపీచంద్‌ను ఘనంగా సన్మానించారు. క్రీడాకారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నారు.

గోపీచంద్ అకాడమీకి చంద్రబాబు భూమి కేటాయింపు
ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచిన పుల్లెల గోపీచంద్‌కు హైదరాబాద్‌లో ‘బ్యాడ్మింటన్ అకాడమీ' నెలకొల్పడానికి అప్పటి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ అకాడమి అనేకమంది ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారుచేసింది.

రియో ఒలింపిక్స్‌లో మెరిసిన పీవీ సింధు
ఆ అకాడమీలోనే శిక్షణ పొందిన పీవీ సింధు గతేడాది రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో, పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కిదాంబి శ్రీకాంత్ కూడా అదే అకాడమీ నుంచి ప్రపంచ బాడ్మింటన్ స్టార్‌గా ఎదిగారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications