Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

All England Open: సింధు ఇంటికి.. లక్ష్యసేన్ ముందుకు

ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో మరో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు షాక్ ఎదురైంది. రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. కొరియా క్రీడాకారిణి, ప్రపంచ ఛాంపియన్ అన్ సె యంగ్ చేతిలో 19-21, 11-21 తేడాతో ఓటమిపాలైంది. వరుసగా రెండు గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తొలి గేమ్‌లో సింధు గొప్పగానే పోరాడింది. ప్రత్యర్థికి దీటుగా బదులచ్చింది. స్వల్ప తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కానీ రెండో గేమ్‌లో దారుణంగా విఫలమైంది. ప్రతిఘటించలేకపోయింది. అటాకింగ్ గేమ్‌తో పాయింట్లు సమర్పించుకుంది. 42 నిమిషాల్లోనే ఓటమిని అంగీకరించింది. అన్ సె యంగ్ చేతిలో సింధుకు వరుసగా ఇది ఏడో ఓటమి. ఇప్పటివరకు యంగ్‌పై సింధు ఒక్కసారి విజయం సాధించలేకపోయింది.

All England Open Lakshya Sen unto quarterfinals and PV Sindhu bow out

సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో జోడీలు కూడా ఓటమిపాలయ్యారు. డబుల్స్ ప్రపంచ నంబర్ వన్ సాత్విక్-చిరాగ్ ద్వయం ఇండోనేషియాకు చెందిన మహ్మద్ షోహిబుల్ ఫిక్రి- మౌలానా బగాస్ చేతిలో 16-21, 15-21తో పరాజాయాన్ని చవిచూశారు. తొలి గేమ్‌లో మాత్రమే సాత్విక్-చిరాగ్ జంట పోటీఇచ్చింది. రెండో గేమ్‌లో ఘోరంగా తడబడింది.

ఇక మహిళల డబుల్స్‌లో అశ్విని -తనీషా జోడీ చైనాకు చెందిన జాంగ్‌ షు జియాన్‌-జంగ్‌ యు చేతిలో ఓటమిపాలైంది. తొలిగేమ్‌లో నెగ్గిన అశ్విని ద్వయం అదే జోరును ప్రదర్శించలేకపోయింది. 21-11, 11-21, 11-21తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మరోవైపు లక్ష్యసేన్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. డెన్మార్క్ షట్లర్ అండ్రెస్ అంటాన్‌సెన్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 24-22, 11-21, 21-14తో నెగ్గాడు. తొలి గేమ్‌లో గెలిచిన గెలిచిన లక్ష్యసేన్ రెండో గేమ్‌లో ఓడాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సత్తాచాటి విజయాన్ని అందుకున్నాడు.

Story first published: Friday, March 15, 2024, 9:50 [IST]
Other articles published on Mar 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+