Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌: 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేనా?

All England Open Badminton Championships 2019: Full Schedule, Players, Live Streaming, Telecast, Time Table

హైదరాబాద్: భారత షట్లర్లకు అందని ద్రాక్షలా ఊరిస్తోంది ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌. నిజానికి టెన్నిస్‌కు వింబుల్డన్‌ ఎలాగో.. బ్యాడ్మింటన్‌కు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ అలాగ. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్‌ తరఫున కేవలం ఇద్దరే మాత్రమే విజేతలుగా నిలిచారు. 1980లో ప్రకాశ్‌ పదుకోన్‌, 2001లో పుల్లెల గోపీచంద్‌ ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు 10 సార్లు ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌ 2015లో ఫైనల్‌ చేరడమే అత్యుత్తమ ప్రదర్శన. ఆ ఏడాది సైనా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బుధవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో టైటిల్‌ సాధించి.. 18 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఆరు సార్లు బరిలో దిగిన సింధు

ఆరు సార్లు బరిలో దిగిన సింధు

ఈ టోర్నీలో భారత్‌ నుంచి సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఫేవరెట్లుగా పోటీపడుతున్నారు. ఆరు సార్లు బరిలో దిగిన సింధుకు నిరుటి సెమీస్‌ ప్రదర్శనే అత్యుత్తమం. ఇప్పటికీ కలగానే మిగిలిన ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ను నిజం చేసుకోడానికి భారత స్టార్లు ఈసారి గట్టిగానే ప్రయత్నించనున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు ఐదో సీడ్‌గా, సైనా 8వ సీడ్‌గా.. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ఏడో సీడ్‌గా బరిలో దిగుతున్నారు.

సంగ్‌ జీ హ్యూన్‌‌తో తలపడనున్న సింధు

సంగ్‌ జీ హ్యూన్‌‌తో తలపడనున్న సింధు

మహిళల సింగిల్స్‌లో ఐదోసీడ్‌ సింధు తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌ టూ షట్లర్‌ సంగ్‌ జీ హ్యూన్‌ (దక్షిణ కొరియా)తో ఆడనుంది. ఇప్పటి వరకు వీరిద్దరు 14 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఎనిమిదింట్లో సింధు, ఆరింట్లో సుంగ్‌ పైచేయి సాధించారు. ఇక, తొలి రౌండ్‌ను అధిగమిస్తే క్వార్టర్స్‌లో మూడోసీడ్‌ చెన్‌ యుఫీ రూపంలో చైనా సవాల్‌ ఎదురుకానుంది. చెన్‌ యుఫీపై 4-3 రికార్డున్నా, గతేడాది చైనా ఓపెన్‌లో ఆమె చేతిలో సింధు ఓడిపోయింది.

సైనాకు సులువైన ప్రత్యర్థే

సైనాకు సులువైన ప్రత్యర్థే

మరోవైపు ఆరంభ రౌండ్లో సైనాకు సులువైన ప్రత్యర్థే ఎదురైంది. క్రిస్టీ గిల్మూర్‌ (స్కాట్లాండ్‌)తో సైనా పోటీపడుతుంది. ఇప్పటి వరకు వీరిద్దరు ఆరు సార్లు తలపడగా.. ఆరింట్లోనూ సైనాదే విజయం. కానీ, క్వార్టర్స్‌లో మాత్రం వరల్డ్‌ నెంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) ఎదురుపడొచ్చు. తై జుతో ముఖాముఖి పోరులో 5-14తో వెనుకంజలో ఉన్న సైనా.. ఆమెతో ఆడిన గత వరుస 12 మ్యాచుల్లోనూ ఓడడం గమనార్హం.

ఏడోసీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌

ఏడోసీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌

పురుషుల సింగిల్స్‌లో ఏడోసీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ మొదటిరౌండ్లో బ్రైస్‌ లెవరెజ్‌ (ఫ్రాన్స్‌)తో ఆడనున్నాడు. తొలి రెండు రౌండ్లను దాటితే క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ కెంటో మెమొటోను శ్రీకాంత్‌ ఓడించాల్సి ఉంటుంది. మిగతా భారత షట్లర్లలో సాయి ప్రణీత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలిరౌండ్లో సిద్ధమవగా.. సమీర్‌ వర్మకు మాజీ నెంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ రూపంలో ఆరంభంలోనే గట్టి ప్రత్యర్థి ఎదురయ్యాడు.

మహిళల డబుల్స్‌లో ఇలా

మహిళల డబుల్స్‌లో ఇలా

ఇక, మహిళల డబుల్స్‌లో ఏడోసీడ్‌ షిహో తనక-కొహరు (జపాన్‌) జంటతో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి జోడీ, ఎకటరీనా-అనినా (రష్యా) జోడీతో మేఘన జక్కంపూడి-పూర్వీషా రామ్‌ జంట తొలిరౌండ్లో పోటీపడనున్నాయి. పురుషుల డబుల్స్‌లో సుమిత్‌ రెడ్డి-మను అత్రి జంట.. చైనా ద్వయం గ్జునాయ్‌-గ్జియాంగ్‌తో తమ పోరు మొదలుపెట్టనుంది.

ఉదయం 9 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

Story first published: Wednesday, March 6, 2019, 10:30 [IST]
Other articles published on Mar 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+