న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శతాబ్దాల చరిత్ర కలిగిన టోర్నీలో భారత్

All England Open 2018: PV Sindhu, Kidambi Srikanth draw previews, full schedule

హైదరాబాద్: అత్యంత పురాతన, ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టోర్నీ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నీ మార్చి 14 నుంచి ఆరంభం కానుంది. కాగా, ఈ టోర్నీకి మూడు వారాల విరామం దొరకడంతో క్రీడాకారులు ఆడేందుకు బాగానే సన్నద్ధమయ్యారు. ఆటగాళ్లతో పాటు అభిమానులకు సైతం ఈ టైటిల్‌ గెలుచుకుని వస్తారనే ఆశలు లేకపోలేదు. ముఖ్యంగా సైనా, సింధు, శ్రీకాంత్‌లపైనే అందరి కళ్లు.

ఇప్పటి వరకు ఒక్క క్రీడాకారిణి కూడా ఈ టైటిల్‌ను గెలుచుకోలేదు. కేవలం భారతదేశం నుంచి ఆడిన ప్రకాశ్ పదుకొణె( 980), పుల్లెల గోపీచంద్ (2001)లో మాత్రమే ఈ టైటిల్ గెలుచుకున్నారు. కాగా బుధవారం నుంచి జరగనున్న టోర్నీని మహిళల సింగిల్స్ విభాగంలో పీవి సింధు లీడ్ చేయనున్నారు.

1899వ సంవత్సరం నుంచి జరుగుతోన్న ఈ టోర్నీలో భారత్‌కు ఇప్పటి వరకు రెండు పతకాలే దక్కాయి. ప్రపంచ నంబర్ 11గా కొనసాగుతోన్న సైనా నెహ్వాల్ టైటిల్ బరిలో ఉన్నారు. ఈ టైటిల్ కోసం ఆమె ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు మరింత శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ టోర్నీలో ఆమెతో తలపడనున్న ప్లేయర్లందరూ ఆమెకు గట్టి పోటీనే ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్‌లో తలపడిన చైనా ప్లేయర్ తాయ్‌పెయ్‌తో గట్టిగా తలపడాల్సిందే.

ఇక పోటీకి సీనియర్లు సైనా, సింధులతో పాటు కిదాంబి శ్రీకాంత్, హెచ్‍‌ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్‌లు సన్నద్ధమయ్యారు. మార్చి 14వ తేదీ జరగనున్న పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.

మహిళల సింగిల్స్‌లో:
1. Tai Tzu Ying [1] vs Saina Nehwal
2. PV Sindhu [4] vs Pornpawee Chochuwong

పురుషుల సింగిల్స్‌లో
1. Son Wan Ho [5] vs Sai Praneeth
2. HS Prannoy vs Chou Tien Chen [8]
3. Brice Leverdez vs Kidambi Srikanth [3]

Story first published: Tuesday, March 13, 2018, 13:12 [IST]
Other articles published on Mar 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X