ఆల్ ఇంగ్లాండ్: ప్రీ క్వార్టర్స్‌లోకి సైనా, సింధు (ఫోటోలు)
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాంఢ్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సింధు 21-10, 21-11తో ప్రపంచ 33వ ర్యాంకర్ మెట్టీ పుల్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది.
కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో స్కోరు 7-6 వద్ద సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 11-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒకసారి వరుసగా మూడు, అనంతరం వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన సింధు
ఇక రెండో గేమ్‌లోనూ ఆరంభం నుంచి సింధు ఆధిపత్యం చెలాయించింది. స్కోరు 7-4 వద్ద సింధు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 13-4తో ముందంజ వేసి ఇక వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో దినార్ దియా అయుస్తిన్ (ఇండోనేసియా)తో సింధు తలపడనుంది.
న జోమి ఒకుహరపై సైనా విజయం
మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ సైనా 21-15, 21-14తో వరుస గేముల్లో న జోమి ఒకుహర (జపాన్)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ 38 నిమిషాల్లో ముగిసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీశాంత్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతను 19-21, 21-19, 12-21తో జహవ్ జున్‌పెంగ్ (చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఖియావ్ బిన్ (చైనా)ను ఓడించిన ప్రణయ్
మరో మ్యాచ్‌లో ప్రణయ్ 17-21, 22-20, 21-19తో ఖియావ్ బిన్ (చైనా)ను ఓడించాడు. సమీర్ వర్మ 17-21, 12-21తో సకాయ్ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. అజయ్ జయరామ్ 19-21, 13-21తో హువాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమిత జోడీ కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డిల జోడీ ఓటమి
ఇక మహిళల డబుల్స్ తొలి రౌండ్లో 21-17, 16-21, 24-22తో లారెన్-సారా (ఇంగ్లాండ్)లపై అద్భుత విజయం సాధించిన అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి జోడీ ఆ తర్వాత రెండో రౌండ్లో 15-21, 21-18, 18-21తో నదియా-సనిరు (మలేసియా) జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు. మరో మహిళల డబుల్స్ జోడీ మేఘన-పూర్విషా జోడీ 19-21, 12-21తో సు యా చింగ్-వు టి జంగ్ (తైపీ) జోడీ చేతిలో ఓడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications