For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్‌ ఇంగ్లాండ్‌లో మళ్లీ నిరాశే: తొలి రౌండ్‌లోనే సింధు నిష్క్రమణ

All England Championships: Sindhu crashes out in Round 1, Sai Praneeth knocks out Prannoy

హైదరాబాద్: ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ సాధించాలన్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. 18 ఏళ్ల నిరీక్షణకు ఈసారైనా తెరపడుతుందునుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది.

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ పోరులో ఐదో సీడ్ సింధు 16-21, 22-20, 18-21 తేడాతో సంగ్ జి హ్యున్(కొరియా) చేతిలో పోరాడి ఓడింది. గత మూడు మ్యాచ్‌ల్లో సంగ్‌పై ఓడిపోవడం సింధుకి ఇది మూడోసారి. ఓవరాల్‌గా ముఖాముఖి పోరులో సింధు 8-6తో ఆధిక్యంలో ఉండటం విశేషం. ఒక గంటా 21 నిమిషాల పాటు హోరాహోరీగా మ్యాచ్‌లో సింధు చాలాసార్లు అనవసర తప్పిదాలకు పాల్పడి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది.

తొలి గేమ్‌లో 6-3తో ముందంజలో కనిపించిన సింధు

తొలి గేమ్‌లో 6-3తో ముందంజలో కనిపించిన సింధు

తొలి గేమ్‌లో 6-3తో ముందంజలో కనిపించిన సింధు ఆ తర్వాత ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయింది. తొలి గేమ్‌ 17 పాయింట్ల వరకు నువ్వానేనా అన్నట్లు నడిచింది. ఇదే అదునుగా దూకుడు పెంచిన సంగ్ జి.. విరామ సమయానికి 11-8తో ఆధిక్యం దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా 4 పాయింట్లతో సుంగ్‌ 21-16తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుని 1-0 ఆధిక్యం సాధించింది.

రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు

రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు

రెండో గేమ్‌లో సింధు గొప్పగా పుంజుకుంది. 14-18తో వెనుకబడిన సింధు.. క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లు సంధించి 17-18తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. అయితే వరుసగా 2 పాయింట్లతో సుంగ్‌ మ్యాచ్‌ పాయింటుకు చేరువైంది. ఈ సమయంలో పట్టుదలగా ఆడిన సింధు వరుస పాయింట్లతో చెలరేగింది. బాడీ స్మాష్‌ సంధించి 22-20తో రెండో గేమ్‌ నెగ్గి మ్యాచ్‌లో ఆశల్ని సజీవంగా నిలుపుకుంది.

ఏకపక్షంగా సాగిన మూడో గేమ్

ఏకపక్షంగా సాగిన మూడో గేమ్

నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఏకపక్షంగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలు సాగిన ఈ గేమ్‌లో సింధు అనవసర తప్పిదాలకు పాల్పడింది. సర్వీస్ తప్పిదాలకు తోడు అనవసర షాట్లతో పాయింట్లు కోల్పోయిన సింధు 10-18తో వెనుకబడింది. ఒకదశలో 13-20తో ఓటమి అంచుల్లో ఉన్న సింధు వరుసగా 5 పాయింట్లతో ఆశలు రేపింది. అయితే, విజయానికి కావాల్సిన ఒక పాయింటును గెలుచుకున్న సుంగ్‌.. 21-18తో సింధు ఆశలకు తెరదించింది.

కిదాంబి శ్రీకాంత్‌ ముందంజ

కిదాంబి శ్రీకాంత్‌ ముందంజ

పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశాడు. 21-13, 21-11తో బ్రైస్‌ లెవెరెడ్జ్‌ (ఫ్రాన్స్‌)ను చిత్తు చేశాడు. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 21-19, 21-19తో హెచ్‌ఎస్ ప్రణయ్‌పై అద్భుత విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన, పూర్వీశ జోడీ 21-18, 12-21, 12-21తో రష్యా ద్వయం ఎక్టరీనా బొలోతోవా, ఎలీనా చేతిలో ఓడింది. మరో డబుల్స్‌లో సిక్కిరెడ్డి, అశ్విని జంట 21-16, 26-28, 16-21తో జపాన్ జోడీ శిహో తనకా, కొహరు యెనోమోటోపై ఓటమిపాలైంది.

లిన్‌ డాన్‌కు చుక్కెదురు

లిన్‌ డాన్‌కు చుక్కెదురు

పురుషుల సింగిల్స్‌లో తొలి రోజే సంచలనం నమోదైంది. చైనా దిగ్గజ క్రీడాకారుడు లిన్‌ డాన్‌ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా, రెండుసార్లు ఒలింపిక్స్‌ విజేతగా, ఆరుసార్లు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌గా నిలిచిన ఈ సూపర్‌ స్టార్‌ 21-19, 14-21, 7-21తో ప్రపంచ 17వ ర్యాంకర్‌ కాంటా సునెయామ (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ను అతికష్టమ్మీద నెగ్గిన ఈ ఆసియా మాజీ చాంపియన్‌ రెండో గేమ్‌ నుంచి తడబడ్డాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. ఇప్పటివరకు 15 సార్లు ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌లో పాల్గొన్న లిన్‌ డాన్‌ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇదే ప్రథమం.

Story first published: Thursday, March 7, 2019, 9:44 [IST]
Other articles published on Mar 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+