ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్: క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్

హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, ప్రిక్వార్టర్స్‌లో యువ షట్లర్ సాయి ప్రణీత్ తన పోరాటాన్ని ముగించాడు. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో సైనా 8-21, 21-16, 21-13తో లైన్ హోజ్‌మార్క్(డెన్మార్క్)పై పోరాడి గెలుపొందింది.
51నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి గేమ్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్న సైనా వరుసగా రెండు గేమ్‌లు దక్కించుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. తొలి గేమ్‌లో సైనా 8-21తో దారుణంగా చిత్తయింది. ఇక, రెండో గేమ్‌లో 4-4తో సమంగా ఉన్న స్థితిలో వరుసగా మూడు పాయింట్లతో ఆధిక్యం సాధించింది. అయితే బ్రేక్ సమయానికి జేర్స్‌ఫెల్ట్ 11-9తో ఆధిక్యంలో ఉంది.

అనవసర తప్పిదాలతో
ఈ దశలో ప్రత్యర్థి అనవసర తప్పిదాలతో లాభం పొందిన సైనా 13-11తో పైచేయి సాధించింది. ఆ తర్వాత ఏమాత్రం పట్టు తప్పకుండా క్రాస్ కోర్టు విన్నర్, స్మాష్‌లతో చెలరేగి 21-16తో పోటీలో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆరంభంలోనే 4-1తో ముందుకెళ్లిన సైనా ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో
క్వార్టర్స్‌లో రెండు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ తైజు యింగ్(చైనీస్ తైపీ)తో సైనా తలపడే అవకాశముంది. మరోవైపు బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సైనా 21-17, 21-18తో కిర్‌స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-17, 11-21, 21-12తో జొనథాన్ క్రిస్టి(ఇండోనేషియా)పై విజయం సాధించాడు.

క్రిస్టిపై శ్రీకాంత్‌కు ఇదే తొలి గెలుపు
గత మూడు మ్యాచ్‌ల్లో క్రిస్టిపై శ్రీకాంత్‌కు ఇదే తొలి గెలుపు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న కిడాంబికి రెండో గేమ్‌లో మాత్రం ఓటమి ఎదురైంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో దూకుడు కనబరిచిన శ్రీకాంత 21-12తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మెమోటా(జపాన్)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. మరో సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 12-21, 17-21తో లాంగ్ అంగుస్(హాంకాంగ్)పై ఓడి నిష్క్రమించాడు.

తొలి రౌండ్‌లో సమీర్ వర్మ ఓటమి
ఇక, బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు పరాజయాలే ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సమీర్ వర్మ 21-16, 18-21, 14-21 తేడాతో అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడగా.. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 19-21, 21-16, 14-21 తేడాతో గ్జాన్యి-గ్జియాంగ్యు (చైనా) చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి 21-23, 17-21 తేడాతో చాంగ్ టక్-వింగ్ (వియత్నాం) చేతిలో ఓడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications